"తొలిపొద్దు" మరో టపాల చోరీ వెబ్సైటు

>> 26 October 2014 || Reading time: ( words)

తెలుగులో కాపీ / పేస్ట్ బ్లాగుల ఆగడాలకు   అంతే లేకుండా పోతుంది ... "బ్లాగు పైరసీ " గా దీనికి పేరు పెట్టవచ్చేమో అనిపిస్తుంది ! ఈ లిస్టులో క్రొత్తగా తెలుగు దినపత్రిక అని చెప్పబడుతున్న "తొలిపొద్దు" చేరింది. ఈ వెబ్సైటులో అనేక విభాగాలు ఉన్నాయి . ఆరోగ్యం, ఆధ్యాత్మికం, వాస్తు ఇలా ఎన్నో .. అన్ని విభాగాల్లోనూ అనేక బ్లాగుల నుంచి సేకరించిన టపాలను కాపీ / పేస్టు  చేసేసారు .
ఒక ఉదాహరణ చెప్పాలంటే  -
నేను  నా " టెక్నాలజీ" బ్లాగులో 2011 అక్టోబర్ 17 న వ్రాసిన ఏ ప్రపంచ భాషనైనా తెలుగులో చదవండి ఒక్కనిమిషంలో!!  అనే టపాను నాలుగు రోజుల క్రితం టైటిల్ తో సహా కాపీ చేసి ఈ వెబ్సైటులో చొప్పించారు  .

దీన్ని http://tholipoddu.com/?p=1163 అనే లింక్ లో చూడొచ్చు . ఈ టపాను 22 అక్టోబర్ 2014 అనగా నాలుగు రోజుల క్రితం చోరీ చేసారు . దీని గురించి అ బ్లాగు నిర్వాహకులను సంప్రదిస్తున్నాను . అలాగే గూగుల్ కి కంప్లయింట్ ఇస్తున్నాను . మీ బ్లాగు టపాలు కూడా చోరీ అయ్యే ఉంటాయి . ఓ సారి చెక్ చేసుకోండి

కొసమెరుపు  ఏమిటంటే ఈ బ్లాగు నిర్వాహకులకు కనీసం " ఆణిముత్యాలు" అని తెలుగులో వ్రాయడం కూడా రాదు .
tholipoddu 
ఈ వెబ్సైటు నిర్యాహకుని వివరాలు
Registrant Name: Leela Krishna
Registrant Organization: webhostclub.net
Registrant Street: Hyderabad  
Registrant City: Hyderabad
Registrant State/Province: Andhra Pradesh
Registrant Postal Code: 500031
Registrant Country: IN
Registrant Phone: +91.9000019833
Registrant Phone Ext:
Registrant Fax:
Registrant Fax Ext:
Registrant Email: @gmail.com
Registry Admin ID: DI_24098005
Admin Name: Leela Krishna
Admin Organization: webhostclub.net
Admin Street: Hyderabad 
Admin City: Hyderabad
Admin State/Province: Andhra Pradesh
Admin Postal Code: 500031
Admin Country: IN
Admin Phone: +91.9000019833

6 గురు ఇలాగన్నారు...:

sarma October 27, 2014 at 6:04 AM  

ఇలా తస్కరించుకుపోవడం బాగా అలవాటయిపోయిందండి. నా బ్లాగు నుంచి ఇరవై టపాలెత్తుకుపోయారు. వారిని పట్టుకున్నా, గోల చేసినా ఉపయోగం లేకపోయింది. దీనికి విరుగుడు చూడాల్సిందే, అప్పటినుంచి రాయడానికే మనసు రావటం లేదు.దారుణాలే జరుగుతున్నాయండి, వీరిని సమర్ధించేవారూ ఉంటున్నారు, అదో చిత్రం. వీలయితే పత్రికవారి మీద చర్య తీసుకోండి.

శ్యామలీయం October 27, 2014 at 8:42 AM  

దీని గురించి అ బ్లాగు నిర్వాహకులను సంప్రదిస్తున్నాను .
................ కేవలం వృధాప్రయాస.

అలాగే గూగుల్ కి కంప్లయింట్ ఇస్తున్నాను .
................. ఇది సరైన చర్య,

మీ బ్లాగు టపాలు కూడా చోరీ అయ్యే ఉంటాయి .
................. ఏమీ‌ అనుమానం అక్కరలేదు. దొంగలకు విచక్షణ ఉండదు, ఎవర్నీ వదలరు.

ఓ సారి చెక్ చేసుకోండి.
................. ఒకసారి కాదు పదేపదే ఇలా చెక్ చేసుకుంటూ‌ ఉండాలి మరి. రోజూ పడుకునే ముందు తలుపులూ తాళాలూ సరిచూసుకోమా? అలాగే ఇదీను అన్నమాట!

శ్యామలీయం October 27, 2014 at 8:46 AM  

మరొక్క మాట,
ఫలాని టపాన్య్ మీరు కాపీ కొట్టారూ‌ నేను గూగుల్ వారికి మీ మీద చర్యతీసుకోమని ఫిర్యాదు చేస్తున్నాను అని చెప్పటం మంచిది కాదు. మీరు ఫిర్యాదు చెస్తే గూగుల్ దానిని పరిశీలించేలోగానే వారు తొలగించి పళ్ళికిలిస్తారు. మీ ఫిర్యాదు చెల్లకుండా పోవచ్చు. గూగుల్ లోతుగా పరిశోధన చేస్తే తప్ప, ఎందుకైనా మంచిది, ఫిర్యాదు చేసేవారు ఇలా దొంగబ్లాగుకి హెచ్చరిక చేయకండి. అలాగే మీరు పసిగట్టిన సంగతీ వెల్లడించకండి. నేరుగా గూగుల్ వారికి ఫిర్యాదు చేసేయండి. మీరు విజయం సాధించాక ఆ సంగతిని విపులంగా వివరిస్తూ ఒక టపా వేయండి. మీకు క్షేమం, అందరికీ లాభం - ఒక్క దొంగబ్లాగు(ల)కు తప్ప.

Anonymous,  October 27, 2014 at 12:08 PM  

sarma gariki, sadaru girija kandimalla mi gurinchi facebook lo karu kuthalu koosthundi. tagina charya tisukogalaru.

srinivasrjy November 3, 2014 at 10:05 PM  

పైన చెప్పిన టపాను క్రింది బ్లాగు కూడా చోరీ చేసింది

http://shravancholleti.blogspot.in/2013/03/december-2011.html

srinivasrjy November 22, 2014 at 9:53 PM  

పైన తెలిపిన తొలిపొద్దు నా బ్లాగులో కాపీ చేసుకున్న అన్ని టపాలనూ తొలగించింది . ఈ విషయమై ఈ రోజు గూగుల్ నుండి మెయిల్ కూడా వచ్చింది .

Post a Comment

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Disclaimer

The content in this blog is wriiten by me after getting knowledge in the product. But it is not tested practically. So, telugutechno.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality, decency, or any other aspect of the content of other linked sites. All the links On telugutechno.blogspot.com are from other third party sites and public servers that are on the Internet. The files or links are not hosted on this server. We dont want to hurt any body's feeling with our posts in the blog. Incase, if any body has any kind of objection on the posts on this blog, then please contact us with valid identity and such posts will be removed immediately.

  © Top Telugu Blogs |

Back to TOP