22 June 2025

"శోధిని" లో ఇటీవలి మార్పులు ...

 1. అనామక కామెంట్లు హోమ్ పేజీ నుండి కనపడవు . 

వాటిని విడిగా ఇక్కడి నుంచి  

లేదా ఇటీవలి ప్రముఖ వ్యాఖ్యాతలు లో    చూడవచ్చు 

 2.లింకులతో కూడిన కామెంట్లు శోధిని లో కనపడవు 

 శోధినిలోఇతర మార్పులు

పోస్టు లో పెట్టిన బొమ్మ ఒకటి కనపడుతుంది (తెలుగు హోమ్ పేజీ లోతప్ప మిగతా అన్ని విభాగాల్లో)                  

 

       

18 February 2025

తిరుపతిలో ఘనంగా జరిగిన "తెవికీ పండుగ 2025"

 తెలుగు వికీపీడియా ఆద్వర్యంలో ఈ నెల 14,15,16 తేదీల్లో తెలుగు వికీపీడియా పండుగ 2025 తిరుపతిలో జరిగింది. దేశంలోని వివిధ ప్రాయంత్రాల నుంచి వచ్చిన 50 మందికి పైగా సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. 

తెలుగు లోఇప్పకికే లక్షకు పైగా వ్యాసాలతో ఉన్న  వికీపీడియాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి తెలుగు బాషపై ఆసక్తి ఉన్న ఎవరైనా తమ వంతు సాయంగా వ్యాసాలు రాయవచ్చు. దీనికోసమై తెవికీ బడి పేరుతో శిక్షణ కూడా అందిస్తున్నారు. 

తెలుగు  బ్లాగర్లు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, సామాజిక వాదులు ఎవరైనా సరే తమ తమ రంగాలలో వ్యాసాలను వికీపీడియాలో జతచేయవచ్చు. దీనికోసమై కాస్త శిక్షణ తీసుకుంటే చాలు. 

వివరాలకు వికీ పీడియా చూడండి.. ఇక్కడి నుండి 

ఈ కార్యక్రమ పోటోలు 

 







01 January 2025

🎉Happy New Year 2025 🎉

🎉🎊 Happy New Year 2025 to Telugu Blog Viewers and Writers 🎉🎊

 


15 July 2023

'శోధిని' క్రొత్త వర్షన్ ఇప్పుడు అవసరమా?

 బ్లాగులు రాసేవారూ , చూసేవారూ గణనీయంగా తగ్గిపోయారు ... దీనికి చాలా కారణాలున్నా ముఖ్యమైనవి ఏంటంటే - 

1. బిజీ లైఫ్ 

2. తెలుగు ప్రాధాన్యత తగ్గడం. యువకులు రాకపోడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం రాస్తున్నది, చూస్తున్నది పాతతరం వారే.

3. సోషల్ మీడియా 


ఇక ఆగ్గ్రిగేటర్ లు చూసేవారు వేలలోంచి వందలోపుకి పడిపోయారు . అయితే ఇలాంటి పరిస్థితిలో 'శోధిని' క్రొత్త వర్షన్ అవసరమా?  అని మీరు అడగొచ్చు . 

చాలా కాలంనుండి అదే స్క్రిప్ట్ వాడడం , సర్వర్లు  క్రొత్త స్క్రిప్ట్ లతో అప్డేట్ అవ్వడంతో ఒక్కోసారి కొన్ని ఎర్రర్ లు వస్తున్నాయి . అలాగే ఆ స్క్రిప్ట్ నూతన ఫీచర్లకు అనుగుణంగా లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. 

ఇప్పుడు లాభం ఏమిటి? 

మీరు టపా కానీ వ్యాఖ్య కానీ రాసిన క్షణాల్లోనే శోధిని లో ప్రత్యక్షం. 

కొత్త ఫీచర్స్ ఎన్నో తీసుకు రావొచ్చు. 


రాబోయే మార్పులు, చేర్పులు ఏంటి 

  • తెలుగు వార్తా పత్రికల సంకలిని - ఈనాడు, సాక్షి లాంటి ప్రధాన పత్రికలతో 
  • యూట్యూబ్ సంకలిని - తెలుగు చానల్ లతో 

బ్లాగుల విభాగంలో రాబోతున్నచేర్పులు 

  • రచయిత, బ్లాగు ఆధారంగా టపాలు
  • ఎక్కువగా రాసినవారి పేర్ల లిస్టు

ఇంకా ఎన్నో ... 






Related Posts Plugin for WordPress, Blogger...