మనకు తెలుసు కొన్ని వెబ్ సైట్లు ఇతరులు వాటినుంచి సమాచారాన్ని కాపీ చేసుకోకుండా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయని.ఒకవేళ ఆయా వెబ్ సైట్ల లోని సమాచారం మనకు ఉపయోగపడేది అయితే దీన్ని కాపీ చేసుకోలేకపోయామే అన్న బాధ మనకు కలుగుతుంది కదా !!!

సాధారణంగా వెబ్ సైట్లు జావా స్క్రిప్టు ( java script) ను ఉపయోగించి ఇలా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయి. అప్పుడు మనం ఈ జావా స్క్రిప్టు మన బ్రవుసర్ లో రన్ అవకుండా బ్లాక్ చేస్తే సరి...!!!
మరి అదేలాగోచూద్దాం:
ఇంటర్నెట్ ఎక్ష్ప్ ప్లోరర్ లో :
- Tools>Internet options>Security కు వెళ్ళండి .
- Custom Level పై క్లిక్ చేయండి.
- Scripting Section అనేది ఎక్కడ ఉందో వెతకండి .చివరిలో ఉంటుంది చూడండి.
- Active Scripting అని ఉంటుంది . దీన్ని డిసేబుల్ చేయండి .
- OK ని క్లిక్ చేయండి .
- బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
మొజిల్లా ఫెయిర్ ఫాక్ష్ లో :
- Tools>Options>Content కు వెళ్ళండి .
- Enable JavaScript అనే దానిపై టిక్ తీసేయండి .
- OK ని క్లిక్ చేయండి .
- బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
గూగుల్ క్రోమ్ లో :
- Wrench Icon ఉందికదా పైన ? దానిపై పై క్లిక్ చేయండి..
- Options పై క్లిక్ చేయండి.
- ఎడమ చేతివైపు టేబ్ లలో Under the Hood tab కు వెళ్ళండి.
- Content Setings పై క్లిక్ చేయండి. ఇప్పుడు JavaScript పై క్లిక్ చేయండి.
- java script ని రన్ అవకుండా డిజేబుల్ చేయండి .బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
ప్రస్తుతానికి సెలవు
11 comments:
ఇంత తతంగం ఉందా. నేను జస్ట్ సెలక్ట్ చేసి CTRL +C వాడుతున్నాను ఇప్పటివరకూ.
Nice
According to Myself
This is More use full info
Thanks
good info
Useful info.
use right to click add on
thanks srinivas good info
IP address ante amiti? konchem vivaramga cheppandi.
IP address ante amiti? konchem vivaramga cheppandi.
website ni ela create chestaru? facebook,filpkart,quikr elati website lu create cheyataniki entha money karchuavuthundi?
రైట్ టు క్లిక్ ఇప్పుడు అందుబాటులో లేదు. Happy Right-Click అనే ఎక్ష్తెన్శన్ ఫైర్ఫాక్స్ కి దొరుకుతోంది. ఇది వేసుకుంటే, రీస్టార్ట్ లు అవసరం లేకుండా నేరుగా అడ్రస్ బార్ లో కనిపించే మౌస్ గుర్తు మీద నొక్కితే రైట్ క్లిక్ వస్తుంది కాపీ చేసుకోవడానికి.
మిత్రమా నమస్తే! నా బ్లాగు పోస్టు ఈ మధ్య శోధిని బ్లాగు అగ్రిగేటర్‍లో కనబడడంలేదు. కారణం, RSS feed ఆఫ్ చేశానన్నారు. అసలు ఈ ఆరెసెస్ అంటే ఏమిటో నాకు తెలియదు. దాన్ని ఎలా ఆన్ చేయాలో తెలియదు. దయతో మీరు కాస్త చెప్పగలరు.
Post a Comment