02 June 2013

చైనా వస్తువులు ఎందుకు వాడకూడదు? కొన్ని కారణాలు

అతి చవుకగా వస్తున్నాయని చైనా వస్తువులు ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కానీ అవి వాడడం ద్వారా మనకు అలాగే మిగతా ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని నేను ఎంతోకాలంగా అందరితో పంచుకోవాలని అనుకుంటూ నా మనసు దోలిచేస్తుంటే ఇప్పుడు చెపుతున్నాను .


1.చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. అక్కడ ప్రతీదీ ప్రభుత్వ సొంతం. అలాగే మనం కొనే వస్తువులపైన లాభం కూడా! ఆ లాభంలొ చాలా భాగాన్ని చైనా తన రక్షణాపాటవాన్ని పెంచుకోడానికి ( ముఖ్యంగా అమెరికా, ఇండియా లను దెబ్బతీసేందుకు ) వినియోగిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రపంచం మొత్తానికి నష్టమే.
2. చైనా ఉపయోగించే టెక్నాలజీ ఒక తక్కువరకముది. మొబైళ్ళలోనూ, ఇతర ఆట వస్తువులలోనూ ఉపయోగించే పరికరాలు, సాఫ్ట్వేర్ రిపేరు చెయ్యడాని కూడా వీలుకాకుండాఉంటుంది. దీని ద్వారా మనం మరలా మరలా డబ్బు ఆ చైనాకే తగలేస్తున్నాం.
3. క్రొత్తగా టెక్నాలజీని అభివ్రుద్దిచెయ్యాలనుకున్న ఔత్సాహికులు తమ ఆలోచనలను విరమించుకోవడమో, లేదా వారి టెక్నాలజీకి మూలాధారంగా మళ్ళీ చైనా పరికరాలనే ఉపయోగించడమో చేస్తున్నారు.దీని ద్వారా టెక్నాలజీ బద్దకం ఏర్పడుతోంది.గత కొన్నేళ్ళుగా ప్రపంచమంతా ఇది కనపడుతోంది. ఉదాహరణ: నా చిన్నప్పుడు జపాన్ రేడియో అంటే చాలా గొప్ప. వాళ్ళు ఏది తయారు చేసినా అతి నాణ్యతతో తయరు చేసేవారు ఇప్పుడు జపాన్ ఎక్కడుంది?
4. అతి ప్రమాదకారి అయిన ప్లాస్టిక్ ను ఎలా నాశనం చెయ్యాలా అని ప్రపంచమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే చైనా అదే ప్లాస్టిక్ ను బొమ్మలు గానో , ఇతర వస్తువులుగానో మర్చి ప్రపంచం పైకి వదిలి మరీ సొమ్ము చేసుకుంటుంది .
5. మిగతా దేశాల లాగ చైనాలో ఏదైనా కనిపెట్టిన తర్వాత దాని లోపాలనూ పర్యవసానాలనూ పరీక్షిస్తూ టైం వేస్ట్ చెసుకొరు. సాద్యమైనంత తొందరగా ప్రపంచం మీదికి వదిలేస్తారు . అందుకే వారు తయారు  చేసిన ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియేషన్ ను అవసరానికి మించి ఉత్పత్తి  చేస్తుంటాయి .
ఆలోచించే కొలదీ ఇంకా అనేక కారణాలు బయట పడుతాయి . కనుక ప్రభుత్వం సంగతి తర్వాత ముందు మనం చైనా వస్తువులను వాడకుండా ఉండడమే బెట్టర్ . మనకీ మన పిల్లలకీ కూడా .... ఆలోచించండి !!!

13 comments:

Anonymous said...

You are true. Let us BAN CHINA GOODS

శ్యామలీయం said...

మీరు అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన కారణాన్ని ప్రస్తావించటం‌ మరచారు.

" చైనాలో చిన్నపిల్లలచేత బలవంతంగా పనిచేయించి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. "

ఇది అంతర్జాతీయనేరం.
అందుచేత చైనా వస్తువులను బహిష్కరించటం మన కర్తవ్యం!

Anonymous said...

so sad

Anonymous said...

చైనా దురాక్రమణలో మన భూభాగం కొంత విలవిలలాడుతోంది!చైనా వస్తువులు చవకే కానీ మన్నవు ముట్టుకుంటే పుటుక్కుమంతాయి!అక్కడివి అన్నీ అంతే! అత్యంత తాత్కాలికం, క్షణికం!smuggled గూడ్స్ చైనా నుంచి గుట్టలు గుట్టలుగా వచ్చిపడి మన ఎకానమీని దెబ్బ తీస్తున్నవి! వేరే దేశాల పౌరులే మన దేశ సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చి ఇష్టారాజ్యంగావచ్చి మన పౌరులుగా చెలామణీ అవుతుంటే ప్రభుత్వం తమాష చూస్తుంది!ఇక smuggling ను ఎలా అరికట్టగలుగుతుంది!?కనుక దేశభక్తులయిన ప్రజలు చైనా లో తయారయిన వస్తువులు ఏవీ ససేమిరా కొనకండి!నేనూ కొననే కొనను!

Anonymous said...

చైనా దురాక్రమణలో మన భూభాగం కొంత విలవిలలాడుతోంది!చైనా వస్తువులు చవకే కానీ మన్నవు ముట్టుకుంటే పుటుక్కుమంతాయి!అక్కడివి అన్నీ అంతే! అత్యంత తాత్కాలికం, క్షణికం!smuggled గూడ్స్ చైనా నుంచి గుట్టలు గుట్టలుగా వచ్చిపడి మన ఎకానమీని దెబ్బ తీస్తున్నవి! వేరే దేశాల పౌరులే మన దేశ సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చి ఇష్టారాజ్యంగావచ్చి మన పౌరులుగా చెలామణీ అవుతుంటే ప్రభుత్వం తమాష చూస్తుంది!ఇక smuggling ను ఎలా అరికట్టగలుగుతుంది!?కనుక దేశభక్తులయిన ప్రజలు చైనా లో తయారయిన వస్తువులు ఏవీ ససేమిరా కొనకండి!నేనూ కొననే కొనను!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ముఖ్యంగా గమనించాల్సిన సంగతులివి.
ధన్యవాదాలు. ఈ బ్లాగ్ లంకె ఇస్తూ ఫేస్ బుక్ లో షేర్ చెయ్యవచ్చా? లేక మీరు ఇప్పటికే ఫేస్ బుక్ లో పెట్టి షేర్ చేసుకోవడం ఎట్లాగో చెప్పండి దయచేసి.

srinivasrjy said...

లక్ష్మి గారూ
తప్పకుండా ఫేస్ బుక్ లో షేర్ చేద్దాం. నేనూ చేస్తున్నా...

Mohana said...

మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు.

Murthy K v v s said...

అవును నిజం చైనా వస్తువులు చాలా తొందరగా పాడవుతాయి.కొన్నంత సేపు పట్టదు పనికి రాకుండా పోవడానికి...!అప్పుడప్పుడనిపిస్తుంది అసలీ వస్తువులని చైనా నుంచి దిగుమతికి ఎందుకు మన దేశం అనుమతిస్తుంది.బహుశా మన వాళ్ళ బలహీనతల్ని ఏవో బాగానే పట్టివుంటారు. ఆసియా ఖండం నుంచి వీటో పవర్ వున్న (U.N. లో) శక్తి చైనా ఒక్కటే..! అమెరికా తో కూడా కొన్ని విషయాల్లో strategic understanding వారికి వున్నది.అంతర్జాతీయ వ్యవహారాలు చాలా మటుకు చిక్కు ముళ్ళతోనూ..పైకి కనిపించని ఒప్పందాలతోనూ కూడుకొని వుంటాయి.

Dr. P. Srinivasa Teja said...

అర తలకాయతో, సగం తెలిసీ సగం తెలియక రాస్తే ఈ బ్లాగులో వ్యాసం లాగే ఉంటుంది. చైనాలో 45 వేలు పెట్టి కొనే సాంసంగ్ ఫోనూ తయారు అవుతుందీ, వెయ్యి రూపాయలకు దొరికే ఫోనూ తయారు అవుతుంది. కాకుంటే క్వాలిటి వాటిని అమెరికా లాంటి దేశాలు దిగుమతి చేసుకుంటే నాసి రకంవి మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఒక్క రెండు రోజులు చైనా నుంచి షిప్పులు, విమానాలలో వస్తువులు రాక పోతే అమెరికాలో పిల్లలు ఉచ్చపోయటం కూడా కస్టమే(నాప్కినులు లేక)అమెరికాలో పిల్లలు ఆడుకొనే బొమ్మలు దాదాపు చైనాలో తయారు అయినవే. వాటికి లేని క్వాలిటి ఇండియాకు పంపే బొమ్మలకు ఎందుకు ఉండదూ? అమెరికా వాడు నాసీ రకపు వస్తువులు కొనడు వాడరు మరి. మనం కొంటాము. చైనాతో మనకు బార్డరు వివాదం ఉంది అంటే అది వేరు సంగతి. మనతో సహా ఏ దేశం వాడి వ్యాపారం వారిదీ. కొనే వాడికీ, దిగుమతి చేసుకొనేవాడికి ఉండాలి. చైనా వాడి మీద పడి ఏడవటం ఎందుకూ? చైనాలో చిన్న పిల్లల చేత పని చేయిస్తారా? ఎవడు చూసి వచ్చిన వెధవ? అబద్దాలు, పుకారులు రాయటానికి కూడా ఓ హద్దు ఉండవద్దూ? మన దేసంలో ఉన్నంత మంది బాల కార్మికులు మరెక్కడా లేరని యునెస్కో కోడి అయి కూస్తుంటె కనపడని పిల్ల కార్మికులు చైనాలో ఉన్నారని అవాకులూ చవాకులు రాయటం మరీ దారుణం.

శ్యామలీయం said...

తేజాగారూ,

క్షమించాలి అవాకులూ చవాకులూ వ్రాయాలని నా ఉద్దేశం‌ కాదండీ. నా యెరుకలోని విషయం నేను ప్రస్తావించాను. అది ఒక వేళ తప్పయితే, కావచ్చును. అంతమాత్ర్సం చేత మీరు దుద్భాషలకు దిగటం‌ సముచితం కాదనుకుటాను. యునెస్కోకోడి కూత నా చెవిని పడలేదు - తెలుసుకుందుకు ప్రయత్నిస్తానండి. మీరు వైద్యులు, అందునా మానసిక వైద్యులు కదా? సంయమనం‌ కోల్పోయి మాట్లాడటం హుందాగా లేదని నా అభిప్రాయం.

మీ బ్లాగులు చూసాను. చాలా బాగున్నాయి. మంచి సమాచారం ఇస్తున్నారు.

srinivasrjy said...

అయ్యా తేజా గారూ .. ఇక్కడ నేను ప్రస్తావించింది చైనా టెక్నాలజీ గురించి. అంతేగానీ చైనాలో ఉన్న ఇతరదేశాల తయారీ విభాగాలగురించి కాదు. స్యాంసంగ్ లాంటి కంపెనీలు కొరియావి, కొరియన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నవి ... ఇంకా.. చైనా బొమ్మలు పదిరూపాయిలవీ ఉండొచ్చు, పది వేలవీ ఉండొచ్చుగాక.. వారికి కావల్సింది డబ్బు. ఎవరికి ఏదికావాలో అలా తయారు చేయడం వారి నైజం. మనదేశంలో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నది చైనా నాశిరకం వస్తువులవల్లనేకదా?
అమెరికాకు పంపించే శ్యాంసంగ్ ఫోన్లు, ఇండియాకు పంపించేవి ఒకటే నంటారా??
మీకేమైనా క్రొత్త విషయం తెలిస్తే అది పంచుకోండి ముందు.. ఇతరులపై విరుచుకుపడడం కాదు.

Unknown said...

Friends Samsung mobiles are not the made in chains it's Korean
and the so called multinational mobile companies said that the mobiles exporting to India and US are same in international quality no doubt about its and children labour in many fields in China of course !being with heavy population children Labour may be more than the India but in India government trying to abolish children Lobour system in future but the so called communists government so far not implemented any single acts for the better ment of children in their country according to the Unisco survey recently

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...