భారతీయ పరిజ్ఞానాన్ని భారతీయులే తక్కువ అంచనా వేయడం మామూలే. అయతే
మీకు గుర్తుందో లేదో! విదేశాలు మన దేశానికి సూపర్ కంప్యూటర్‌లను సరఫరా
చేయడానికి నిరాకరించినప్పుడు పట్టుదలతో నడుం బగించి మరీ సూపర్
కంప్యూటర్‌లను (పరమ్, మేధా వగైరా) రూపొందించింది మన దేశం. నేడు పూర్తి
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శాటిలైట్లు, రాకెట్లు మనవాళ్ళు ప్రయోగించి
సఫలవౌతున్నారు. అంతెందుకు? లక్ష రూపాయలకు ‘కారు’ను రూపొందించి మరీ
మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఘనత మనదే. ఆ మధ్య చాలా చవకగా పీసీని
రూపొందించారు. కానీ ఎందుకో అది మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు అందరి దృష్టీ
‘టాబ్లెట్’ల మీద కావడంతో, చవకగా, నమ్మకంగా పనిచేసే టాబ్లెట్ పీసీలమీద పడింది.
ఏదీ ధర తక్కువ లేదు. నిజానికి టాబ్లెట్ పీసీలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా
ఉంటుంది. ఇంతదాకా దేశీయ ‘టాబ్లెట్’ పీసీ రూపొందించాలని ఎవరూ అనుకొనే లేదు.
ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం అయిన యాడ్రాయిడ్ 2.2తో 7 అంగుళాల టచ్ స్క్రీన్‌తో,
హైడెఫినిషన్ వీడియో కో-ప్రొసెసర్‌తో వస్తోంది. ఇది పూర్తిగా దేశీయంగా తయారైంది.
ఇందులో ఇ-బుక్ చదువుకోవచ్చు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. హైడెఫినియషన్
వీడియో చూసుకోవచ్చు. ఆఫీస్ డాక్యుమెంట్లూ వగైరా చూసుకోవచ్చు. సోషల్ నెట్
వర్కింగ్ సైట్స్‌తో కనెక్టయి ఉండొచ్చు.
ఇంత చక్కని టాబ్లెట్ రూపకల్పన వెనక ఢిల్లీ ఐఐటి విద్యార్థి కృషి ఉంది. ఢిల్లీ ఐఐటికి
ఇంత చక్కని టాబ్లెట్ రూపకల్పన వెనక ఢిల్లీ ఐఐటి విద్యార్థి కృషి ఉంది. ఢిల్లీ ఐఐటికి
చెందిన విద్యార్థి తొలిగా రూపొందించిన డిజైన్ ఆ తర్వాతి దశలో ఐఐటి, రాజస్థాన్‌లో
మరింత మెరుగు పడింది. ఆ ప్రాజెక్టు ‘కల’గా మిగిలిపోకుండా సాకారమైంది. ఫలితంగా
మెరుగైన టాబ్లెట్ పీసీ, అతి తక్కువ ధరకు లభించే దిశగా టాబ్లెట్ పీసీ ‘ఆకాశ్’
ఆవిష్కారమైంది. దీనికోసం ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి.
ఇలాంటి పీసీ టాబ్లెట్‌ల వల్ల ఇంటర్నెట్ సౌకర్యాలు మరింత చేరువౌతాయి. ఈ
టాబ్లెట్‌లను 50% రాయితీతో మన కేంద్ర ప్రభుత్వం విద్యర్థులకు అందజేయబోతోంది.
ఈ ‘ఆకాశ్’ టాబ్లెట్, ఒక లెదర్ కేస్‌తో వస్తోంది. ఈ లెదర్ కేస్‌లోనే కీబోర్డ్ కూడా ఒకటి
ఉంది. టచ్ స్క్రీన్‌తో ఆట్టే అలవాటు లేనివారు ఈ కీబోర్డ్‌తో వేగంగా టైప్
చేసుకోగల్గుతారు. ఈ లెదర్ కేస్ కూడా చవకే. అంతా కలిస్తే మూడువేల
రూపాయలలోపే నంటే భారతీయ చతురత ఏ పాటిదో అర్థమైంది కదూ!
ఓ ఐపాడ్2 బేసిక్ మాడల్‌తో పోలిస్తే రామ్ (512 ఎం.బి.) కొద్దిగా తక్కువ. డిస్‌ప్లే కూడా
ఓ ఐపాడ్2 బేసిక్ మాడల్‌తో పోలిస్తే రామ్ (512 ఎం.బి.) కొద్దిగా తక్కువ. డిస్‌ప్లే కూడా
ఐపాడ్-2లో 10’’. స్టోరేజి 16 జిబి. అందులో ఐఓఎస్ వాడుతున్నారు. కానీ ఐపాడ్-2
ధర దాదాపు 30వేలు. ఇదే బీటెల్ మాజిక్ టాబ్లెట్‌లో 512 ఎంబి రామ్, 8 జిబి స్టోరేజి
(16 జిబి దాకా పొడిగించుకోవచ్చు), యాండ్రాయిడ్ 2.2, 3జి టెక్నాలజీ వాడుతున్నారు.
దానిధర 10వేలలోపే. ఇదే జనాదరణ పొందితే, ఇక లాప్‌టాప్‌లూ, డెస్క్‌టాప్‌లూ పాత
దానిధర 10వేలలోపే. ఇదే జనాదరణ పొందితే, ఇక లాప్‌టాప్‌లూ, డెస్క్‌టాప్‌లూ పాత
సామాన్ల షాపులన్నిటా దర్శనమిస్తాయేమో!
1 comment:
ఇందులో ni Hardware లో IIT , వాళ్లు చేసినది ఏది లేదు ఇది ఒక కెనడా కంపెని చైనా ప్రోడుక్టు తో ఎసంబ్లి చేసినది అసలు ఇప్పడికి కూడా , ప్రాసెసర్ కాని , బ్రోర్డు కాని , స్క్రీను కాని ఒక్క భారతీయ కంపెని స్వదేశి పరిజ్ఞానం తాయారు చేయలేదు అన్ని కూడా పక్కవాడు తయారు చేసిన కోర్ కి పోడిగింతలే , ఇది ఏదో భారతీయ చతురత కాదు మన రాజకీయ నాయకుల చాతుర్యం , ఇంతకన్నా మంచి టాబ్లెట్ లు నలబై డాలర్లకే దొరుకుతున్నాయ్
kaburlu.wordpress.com
Post a Comment