26 October 2011

తెలుగు బ్లాగర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు....(వెరైటీ గా )








లోని వారికి కూడా మా ఈ శుభాకాంక్షలు !!!

25 October 2011

మీ ప్రస్తుత IP అడ్రెస్స్ తెలుసు కోవాలంటే ఈ పోస్టు చదవండి.

తెలిసిందా !! క్రింద ఉంది చూడండి 

వెబ్ సైట్ల లో "రైట్ క్లిక్" ని ఏనేబుల్ చేయడానికి ట్రిక్స్


మనకు తెలుసు కొన్ని వెబ్ సైట్లు ఇతరులు వాటినుంచి సమాచారాన్ని కాపీ చేసుకోకుండా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయని.ఒకవేళ ఆయా వెబ్ సైట్ల లోని సమాచారం మనకు ఉపయోగపడేది అయితే దీన్ని కాపీ చేసుకోలేకపోయామే అన్న బాధ మనకు కలుగుతుంది కదా !!!

ఇటివంటి సైట్ల లో "రైట్ క్లిక్" ని ఎనేబుల్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి . వీటిలో కెల్లా సులువైనది,ఏ విధంసిన్స్ సాఫ్ట్వేర్ అవసరం లేనిది ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా వెబ్ సైట్లు జావా స్క్రిప్టు ( java script) ను ఉపయోగించి ఇలా "రైట్ క్లిక్" ని డిసేబుల్ చేస్తాయి. అప్పుడు మనం ఈ జావా స్క్రిప్టు మన బ్రవుసర్ లో రన్ అవకుండా బ్లాక్ చేస్తే సరి...!!!
మరి అదేలాగోచూద్దాం:
ఇంటర్నెట్ ఎక్ష్ప్ ప్లోరర్ లో : 
  1. Tools>Internet options>Security కు వెళ్ళండి .
  2. Custom Level పై క్లిక్ చేయండి.
  3. Scripting Section అనేది ఎక్కడ ఉందో వెతకండి .చివరిలో ఉంటుంది చూడండి.
  4. Active Scripting అని ఉంటుంది . దీన్ని డిసేబుల్ చేయండి . 
  5. OK ని క్లిక్ చేయండి .
  6. బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.

మొజిల్లా ఫెయిర్ ఫాక్ష్ లో :
  1. Tools>Options>Content కు వెళ్ళండి .
  2. Enable JavaScript అనే దానిపై టిక్ తీసేయండి .
  3. OK ని క్లిక్ చేయండి .
  4. బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
గూగుల్ క్రోమ్ లో : 
  1. Wrench Icon ఉందికదా పైన ? దానిపై   పై క్లిక్ చేయండి..
  2. Options  పై క్లిక్ చేయండి.
  3. ఎడమ చేతివైపు టేబ్ లలో Under the Hood tab కు వెళ్ళండి.
  4. Content Setings పై క్లిక్ చేయండి. ఇప్పుడు JavaScript పై క్లిక్ చేయండి.
  5.  java script ని రన్ అవకుండా డిజేబుల్ చేయండి .బ్రవుసర్ ని రి-స్టార్ట్ చేయండి.
గమనిక : ఈ ట్రిక్ ని  "రైట్ క్లిక్" డిజేబుల్ చేసిఉన్న సైట్లు ఓపెన్ చేసేటప్పుడు మాత్రమె వాడండి . తిరిగి వెంటనే సెట్టింగ్స్ ని యదా స్థాయికి తెచ్చేయండి.లేకపోతె  జావా స్క్రిప్టు ( java script) తో రన్ అయ్యే అప్లికేషన్లు పనిచేయవు.

ప్రస్తుతానికి సెలవు

24 October 2011

పేస్ బుక్ అప్లికేషన్ ఇప్పుడు బ్లాక్ బెర్రీ లో కూడా...

 బ్లాక్ బెర్రీ వినియోగదారులకో శుభవార్త!
ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లకే పరిమితమైన పేస్ బుక్ అప్లికేషను ఇప్పుడు బ్లాక్ బెర్రీ ఫోన్ల లో కూడా లభ్యమవుతోంది... అంటే ఇకనుంచి  బ్లాక్ బెర్రీ వినియోగదారులు కూడా వారి స్నేహితులతో నిరంతరం అందుబాటులో ఉండగలరు.. అంతేకాదు అనేక క్రొత్త సదుపాయాలు కూడా దీనిలో ఉన్నాయి. ఈ అప్లికేషన్ మళ్ళీ మళ్ళీ లాంచ్ చేయకుండానే ఏ ఏ ఫ్రెండ్స్ ఆన్ లైన్ లో ఉన్నారో తెలుసుకోవచ్చు, స్నేహితులనుంచి    మేస్సేజ్ లను అందుకోవచ్చు . ఫోటో లను తీసి వాటిని వెంటనే అప్ లోడ్ చేయవచ్చు. టైపింగ్ ఇండికేటర్ ద్వారా ఏ ఫ్రెండ్ టైపు చేస్తున్నారో చూడవచ్చు( జీ టాక్ లో లాగ ).  క్రొత్తగా పొందుపర్చిన  మాప్పింగ్ సదుపాయం ద్వారా మీ లోకషన్ నూ  షేర్ చయ్యవచ్చు.
ఇక ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లలో కూడా ఈ అప్లికేషన్ క్రొత్తగా అప్ డేట్ అయింది.దీని ద్వారా ఆండ్రాయిడ్ లో22 క్రొత్త భాషలు , ఐ ఫోన్ లో 12 క్రొత్త భాషలు కలుపబడ్డాయి. 
ఇప్పటికీ మీ ఫోన్ లో ఈ లేదంటే ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.



23 October 2011

సిస్టమ్‌ స్లో అవుతోందా...


యువ

పదే పదే మీ సిస్టమ్‌, హేంగ్‌ అయిపోవటమో... చాలా నెమ్మదిగా పనిచేయటమో చేస్తోందా? ఇందుకు మీ సిస్టమ్‌లోరి హార్ట్‌ డిస్క్‌కారణం కావచ్చు. ఈ చిన్న చిట్కా చేసి చూడండి... మీ హార్డ్‌ డిస్క్‌స్పీడు పెంచుకుని మీ పనిలో జరుగుతున్న కాలాహరణాన్ని తగ్గించుకోండి.
సిస్టమ్‌ని ఆన్‌ చేసి Start మెనూని ఓపెన్‌ చేయండి. అందులోని Run బాక్సులో SYSEDIT.exe అని టైప్‌ చేసి రన్‌ చేస్తే....system.ini అని వస్తుంది. ఇప్పుడు ఆ ఫైల్‌ని క్లిక్‌ చేసి, ఫైల్‌ చివర ఉండే [386enh] అనే లైన్‌ దగ్గరకి వెళ్లండి. అక్కడ ఎంటర్‌ని ప్రెస్‌ చేసి Irq14=40%అని టైప్‌ చేసి మళ్లీ ఎంటర్‌ నొక్కండి. ఇప్పుడు సిస్టమ్‌ని రీస్టార్ట్టు చేస్తే.... హార్డ్‌ డిస్క్‌స్పీడు పెంచుకుని వేగంగా పనిచేయటం ప్రారంభిస్తుంది.
(courtecy:Andhraprabha)

22 October 2011

సెర్చ్ నుంచి + ను తొలగించిన గూగుల్

ఒకవేళ మీరు గూగుల్ సెర్చ్ ను తరచూ ఉపయోగిస్తూ దానిలోని క్రొత్త విషయాలు తెల్సుకుంటుంటే మీకో వార్త ...


ఇంతకు ముందు మనం google +maps అని సెర్చ్ చేస్తే maps కీ వర్డ్ గా google లోని ఆర్టికల్స్ చూసేవాళ్ళం   + ను సీర్చ్ లో ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు google+ లాంచ్ అవడంతో ఈ కన్ఫ్యూజన్ నుంచి బయట పడవేయాలని ఈ + ను తొలగించింది గూగుల్ సంస్థ.ఒకవేళ కనుక మీరు అలాగే సెర్చ్ చేస్తే క్రింది సమాధానం వస్తుంది.





అంటే ఇక మనం ఆ సెర్చ్ ఆప్షన్ ణి కోల్పోయినట్లేనా అంటే కాదనే చెప్పాలి. ఇకమీదట " " ను ఉపయోగించాలి .
ఉదా : "గూగుల్" " మాప్స్ "  -- ఇలా అన్నమాట.
ఇంకో విషయమేమంటే ఇతర సెర్చ్ ఇంజన్లయిన BING, MSN  లాంటివి ఇంకా + ను కొనసాగించే అవకాశం ఉంది.

19 October 2011

విండోస్ 8 వచ్చేస్తోంది






               పర్సనల్ కంప్యూటర్‌ను వాడటంలో కొత్త అనుభవాన్ని ‘విండోస్’ ఆపరేటింగ్ సిస్టం ద్వారా రుచి చూపింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ‘విండోస్’ ఆపరేటింగ్ సిస్టం మొదట్లో డాస్ ఆపరేటింగ్ సిస్టంలో పనే్జసేది. నెమ్మదిగా డాస్‌ను తనలోకి ఇమిడ్చేసుకొంది. కమాండ్స్ ఇచ్చేపనే లేకుండా అంతా వౌస్ ‘క్లిక్’లతో పనికానిచ్చేస్తుంది విండోస్. ఇంటర్నెట్, వెబ్‌సైట్ డిజైన్, డాక్యుమెంట్స్ రూపొందించడం, పవర్ పాయింట్స్ చేసుకోడం, ఆడియో, వీడియో -ఇలా అన్నిరంగాల్లో ఎనె్నన్నో సులువుగా వాడే వీలుండే సౌకర్యాలను రూపొందించి యూసర్లను పర్సనల్ కంప్యూటర్లనూ కలిపి విడదీయరాని బంధాన్ని ఏర్పరిచింది. విండోస్ 95, 98, ష, 2000, 2003 తి-, విస్తా, విండోస్-7 ఇలా ఎప్పటికప్పుడు పాత లోపాలను సరిదిద్దుతూ లేని కొత్త సౌకర్యాలనిస్తూ పలు వెర్షన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది మైక్రోసాఫ్ట్.
‘విస్తా’లో సత్తా లేకపోయినా విండోస్-7తో నిలదొక్కుకుంది మైక్రోసాఫ్ట్. విండోస్-7లో అద్భుతాలేవీ లేకపోయినా, అన్ని ఆప్షన్లు సరిగా పనిచేయడం కొంత రిలీఫ్ నిచ్చింది. అయతే విండోస్-7లో పాత వెర్షన్ సాఫ్ట్‌వేర్‌తో, అప్లికేషన్లు సరిగా పని చేయడం లేదు. కొన్ని ఉపకరణాలు వాడటాన్కి సరైన డ్రైవర్స్ ఇప్పటిదాకా రూపుదిద్దుకోలేదు. అయనాసరే పట్టువదలని విక్రమార్కునిలా మైక్రో సాఫ్ట్ ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌లను తెస్తూనే ఉంది. పట్టువదలని విక్రమార్కుల్లా యూసర్లు వాటికై వెంపర్లాడుతూ, ఆనందం పొందుతున్నారు. ఇప్పుడు విండోస్-8 అనే కొత్త వర్షన్‌కు మైక్రో సాఫ్ట్ రూపకల్పన చేస్తోంది. డెవలపర్ల కోసం ఫ్రీగా ‘డెవలపర్ ప్రివ్యూ’ అంటూ అందుబాటులోకి తెచ్చింది మైక్రోసాఫ్ట్. మూడురకాల డిఫరెంట్ ప్యాకేజీలుగా అంటే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం (డెవలపర్ టూల్స్‌తో సహా) -అని మూడు రకాలుగా లభిస్తోంది.
విండోస్ 8ని వాడాలీ అనుకుంటే ఇదివరకే విండోస్ 7 వాడేవారికి ఎలాంటి సమస్యా ఉండదు. ప్రస్తుతం మీరు వాడే పీసీల్లో ల్యాప్‌టాప్‌ల్లో ఏ సమస్యా లేకుండా పనే్జస్తుంది. విండోస్-8ని వాడాలీ అంటే కనీసం 1ద్హిచీ లేదా అంతకన్నా వేగం ఉంటే 32 బిట్/ 64 బిట్ ప్రాసెసర్ ఉండాలి. 32 బిట్ ప్రాసెసర్‌కైతే 1జిబి కనీస రామ్, 64బిట్ ప్రాసెసర్‌కైతే కనీసం 2 జిబి రామ్ ఉండాలి. డిస్క్‌లో 16 జిబి డిస్క్ స్పేస్ (32 బిట్‌కైతే) లేదా 20 జిబి డిస్క్ స్పేస్ (64 బిట్‌కైతే) ఉండాలి. డైరెక్ట్ ఎక్స్9 గ్రాఫిక్స్ ప్రాసెసర్, 1024న768 రెజల్యూషన్‌తో పనిచేసే మల్టీ టచ్ స్క్రీన్ ఉంటే యూసర్ ఇంటర్‌ఫేస్‌లోని కొత్త సౌకర్యాలనూ ‘్ఫల్’ అవ్వచ్చు. అదేం లేకపోయినా మీరు ఫీలవ్వాల్సిందేమీ లేదు.
అప్లికేషన్స్ అన్నీ ‘టైల్ లే అవుట్’లో బాక్స్‌లల్లో తెరపై కనిపిస్తాయి. దీనే్న దిశ్రీని అనకుండా శ్రీని అంటున్నారు. శ్రీని అంటే మెట్రో యూసర్ ఇంటర్‌ఫేస్. ఇది టచ్ స్క్రీన్ పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారు. ఈ బాక్స్‌ల్లో ఉండే అప్లికేషన్స్ పీసీలో ఇంటర్నెట్ కనెక్ట్ కాగానే అప్‌డేట్ అవుతాయి కూడా. రెండు అప్లికేషన్స్‌ను ఏకకాలంలో ‘టచ్’ చేస్తూ ఫీలవ్వచ్చు. విండోస్-8లో బూటింగ్, షట్‌డౌన్ మరింత వేగం పెరగనుంది. ఆన్ చేయగానే కేవలం 10 సెకన్లలో సిస్టం రెడీ. టచ్ కీబోర్డు, లాంగ్వేజి ఎంచుకోగానే మార్పులు జరిగిపోవడం -అదో ప్రత్యేకత. విండోస్ ఎక్స్‌ప్లోరర్ రూపు మారుతోంది. ఫైల్ కాపీ చేయడం, పేర్లు మార్చడం -వీటిలో కొంత కొత్తదనం రానుంది.
అప్లికేషన్స్ అన్నీ వెబ్ సర్వీసులతో కలిసి పని చేస్తాయి. అంటే ఏ గూగుల్ ప్లస్‌లోనో, ఆర్కూట్ లేదా ఫేస్ బుక్‌లోకి ఫొటో అప్‌లోడింగ్ నేరుగా విండోస్ ఎక్స్‌ప్లోరర్ నించే చేసేయొచ్చు. యాపిల్-ఐ స్టోర్ లాగా విండోస్-8 కూడా అప్లికేషన్ స్టోర్‌ని ప్రవేశ పెట్టనుంది. పీసీ, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, నెట్ బుక్, టాబ్లెట్ -అన్నిటికీ విండోస్ 8ను వాడేలా రూపొందుతోంది. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న స్క్రై డ్రైవ్ -ఉచిత స్టోరేజీని కూడా వాడేసుకోవచ్చు. ఆటోమేటిగ్గా సింక్రనైజ్ చేసుకోనూ వచ్చు.
విండోస్-లకు అప్‌గ్రేడ్ కావాలంటే కేవలం 30 నిమిషాలు చాలు అంటున్నారు. విండోస్-7లో పనే్జస్తున్న అప్లికేషన్స్ అన్నీ విండోస్-8లో యథాతథంగా పనే్జస్తాయంటున్నారు. మరి విండోస్-ఎక్స్‌పి వాడేవారి సంగతేంటో! ఏవౌతుందో తెలీడం లేదు.
దీనిలో వాడే ‘విండోస్ టు గో’ అనే సౌకర్యం మాత్రం బాగుంటుందేమో అంటున్నారంతా. లైవ్ యుఎస్‌బి అనే పేరుతో యుఎస్‌బి డివైజ్ ద్వారా ఈ సౌకర్యాన్ని వాడి పీసిని బూట్ చేయగల్గడం విశేషం. ఇది మెరుగైన భద్రతనిస్తుందని అంటున్నారు. ధైర్యముంటే ప్రివ్యూని వాడి చూడండి.

15 October 2011

తెలుగు వెబ్ సైట్ ల అగ్రిగేటర్

మొట్టమొదటిసారిగా తెలుగు వార్తాపత్రికల , బ్లాగుల, సినిమా వెబ్ సైట్ ల లింకులతో ప్రారంభమైన ఈ అగ్రిగేటర్  బ్లాగ్ చూసారా .... బాగుంది కదూ...


http://liketelugu.blogspot.com/

12 October 2011

దేశీయ ‘టాబ్లెట్’


భారతీయ పరిజ్ఞానాన్ని భారతీయులే తక్కువ అంచనా వేయడం మామూలే. అయతే
మీకు గుర్తుందో లేదో! విదేశాలు మన దేశానికి సూపర్ కంప్యూటర్‌లను సరఫరా
చేయడానికి నిరాకరించినప్పుడు పట్టుదలతో నడుం బగించి మరీ సూపర్
కంప్యూటర్‌లను (పరమ్, మేధా వగైరా) రూపొందించింది మన దేశం. నేడు పూర్తి
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శాటిలైట్లు, రాకెట్లు మనవాళ్ళు ప్రయోగించి
సఫలవౌతున్నారు. అంతెందుకు? లక్ష రూపాయలకు ‘కారు’ను రూపొందించి మరీ
మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఘనత మనదే. ఆ మధ్య చాలా చవకగా పీసీని
రూపొందించారు. కానీ ఎందుకో అది మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు అందరి దృష్టీ
‘టాబ్లెట్’ల మీద కావడంతో, చవకగా, నమ్మకంగా పనిచేసే టాబ్లెట్ పీసీలమీద పడింది.
ఏదీ ధర తక్కువ లేదు. నిజానికి టాబ్లెట్ పీసీలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా
ఉంటుంది. ఇంతదాకా దేశీయ ‘టాబ్లెట్’ పీసీ రూపొందించాలని ఎవరూ అనుకొనే లేదు.
ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం అయిన యాడ్రాయిడ్ 2.2తో 7 అంగుళాల టచ్ స్క్రీన్‌తో,
హైడెఫినిషన్ వీడియో కో-ప్రొసెసర్‌తో వస్తోంది. ఇది పూర్తిగా దేశీయంగా తయారైంది.
ఇందులో ఇ-బుక్ చదువుకోవచ్చు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. హైడెఫినియషన్
వీడియో చూసుకోవచ్చు. ఆఫీస్ డాక్యుమెంట్లూ వగైరా చూసుకోవచ్చు. సోషల్ నెట్
వర్కింగ్ సైట్స్‌తో కనెక్టయి ఉండొచ్చు.
ఇంత చక్కని టాబ్లెట్ రూపకల్పన వెనక ఢిల్లీ ఐఐటి విద్యార్థి కృషి ఉంది. ఢిల్లీ ఐఐటికి
చెందిన విద్యార్థి తొలిగా రూపొందించిన డిజైన్ ఆ తర్వాతి దశలో ఐఐటి, రాజస్థాన్‌లో
మరింత మెరుగు పడింది. ఆ ప్రాజెక్టు ‘కల’గా మిగిలిపోకుండా సాకారమైంది. ఫలితంగా
మెరుగైన టాబ్లెట్ పీసీ, అతి తక్కువ ధరకు లభించే దిశగా టాబ్లెట్ పీసీ ‘ఆకాశ్’
ఆవిష్కారమైంది. దీనికోసం ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి.
ఇలాంటి పీసీ టాబ్లెట్‌ల వల్ల ఇంటర్నెట్ సౌకర్యాలు మరింత చేరువౌతాయి. ఈ
టాబ్లెట్‌లను 50% రాయితీతో మన కేంద్ర ప్రభుత్వం విద్యర్థులకు అందజేయబోతోంది.
ఈ ‘ఆకాశ్’ టాబ్లెట్, ఒక లెదర్ కేస్‌తో వస్తోంది. ఈ లెదర్ కేస్‌లోనే కీబోర్డ్ కూడా ఒకటి
ఉంది. టచ్ స్క్రీన్‌తో ఆట్టే అలవాటు లేనివారు ఈ కీబోర్డ్‌తో వేగంగా టైప్
చేసుకోగల్గుతారు. ఈ లెదర్ కేస్ కూడా చవకే. అంతా కలిస్తే మూడువేల
రూపాయలలోపే నంటే భారతీయ చతురత ఏ పాటిదో అర్థమైంది కదూ!
ఓ ఐపాడ్2 బేసిక్ మాడల్‌తో పోలిస్తే రామ్ (512 ఎం.బి.) కొద్దిగా తక్కువ. డిస్‌ప్లే కూడా
ఐపాడ్-2లో 10’’. స్టోరేజి 16 జిబి. అందులో ఐఓఎస్ వాడుతున్నారు. కానీ ఐపాడ్-2
ధర దాదాపు 30వేలు. ఇదే బీటెల్ మాజిక్ టాబ్లెట్‌లో 512 ఎంబి రామ్, 8 జిబి స్టోరేజి
(16 జిబి దాకా పొడిగించుకోవచ్చు), యాండ్రాయిడ్ 2.2, 3జి టెక్నాలజీ వాడుతున్నారు.
దానిధర 10వేలలోపే. ఇదే జనాదరణ పొందితే, ఇక లాప్‌టాప్‌లూ, డెస్క్‌టాప్‌లూ పాత
సామాన్ల షాపులన్నిటా దర్శనమిస్తాయేమో!
Related Posts Plugin for WordPress, Blogger...