05 May 2014

ఓటు వేయండి ! బ్రతికే ఉన్నామని నిరూపించుకొండి !!

     సీమాంధ్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలోనే కాదు అనేక బాషలవారినీ ఆసక్తి గొలిపేలా చేస్తున్నాయి . ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయాక తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. కాకపొతే ఆ ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డ అభ్యర్ధులలో కేసీయార్ తప్ప మిగతావారెవరూ అంత  ప్రాచుర్యంలో లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా కాదు .
      తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి తనకంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నారా చంద్రబాబునాయుడు ఒకవైపు, తర్వాత ఐదు సంవత్సరాలు ప్రపంచ ఐటి పటంపై రాష్ట్ర చిరునామా చెరగకుండా కాపాడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోవైపు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతున్నారు .
       క్రొత్త రాష్ట్రం... క్రొత్త అభివృద్ధి .. క్రొత్త కలలు ..  అటు ఈ ప్రాంత ప్రజలే కాక ప్రపంచ ఐటి దిగ్గజాలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాయన్నది నిజం . ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తమ వ్యాపారవిస్తరణలకు ఈ ప్రాంతంలో అవకాశాలు సంవృద్దిగా ఉన్నాయని వారు నమ్ముతున్నారు . హైదరాబాద్ లో ఉన్న వారిలో చాలామంది ఉద్యోగులు సీమంధ్ర ప్రాంతం వారేనని , వారికి నేరుగా తమ ప్రాంతంలోనే ఉద్యోగం కల్పించే అవకాశం  కల్పిస్తే వారు ఆసక్తి చూపగలరని, దీని ద్వారా భవిష్యత్ లో హైదరాబాద్ కంటే సీమాన్ధ్రలోనే ఐటికి భవిష్యత్ ఉంటుందని వారి ఆశ.
   ఇంతటి ప్రాముఖ్యత కలిగిస్తున్న ఈ ఎన్నికలలో ఓటు అందరూ తప్పక వేయాలి !
   ఒకవేళ సీమాంధ్రలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు, విద్యార్ధులు,వ్యాపారులూ ఎవరైనా తెలంగాణా ప్రాంతంలో గానీ, ఇతర రాష్ట్రాలలో గానీ ఉంటే తక్షణం మీ మీ ప్రాంతాలకు బయలుదేరండి !!
మీ ఓటు ... మీ భవిష్యత్ ... !!
ఓటు వేయండి ! బ్రతికే ఉన్నామని నిరూపించుకొండి !!
జై ఓటు ! జై జై ఓటు !!!



Related Posts Plugin for WordPress, Blogger...