కొన్ని సంవత్సరాల నుండి అనేక వెబ్ సైట్ లకు సేవలను అందించిన యాహూ పైప్స్ఈరోజు తెల్లవారుజామునుండి పనిచేయడం లేదు . ఈ సర్వీసును సెప్టెంబర్ నెలాఖరుకు ఆపేస్తామని యాహూ ముందే ప్రకటించింది. చాలామంది డెవలపర్లు ఈ సర్వీసును ఉపయోగించి తమ తమ కోడ్ లను వాడుకునేవారు .
యాహూ పైప్స్(Yahoo pipes)కు ప్రత్యామ్నాయంగా IFTTT, Zapier లాంటి సంస్థలు కొన్ని సర్వీసులు ప్రారంభించినా అవి దీనికి సమాన జోడీ కానేరవు ..ముఖ్యంగా యాహూ పైప్స్ ను rss feed ను తమకు ఇష్టం వచ్చిన రీతిలోనికి మార్చుకునేందుకు, చాలా ఫీడ్ లను కలిపి ఒకటిగా చేసేందుకు వాడేవారు .