అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014
>> 21 August 2014 || Reading time: ( words)
ఇంటర్నెట్ మాధ్యమాలలో బ్లాగర్లు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు . 2012 లో 24.3 మిలియన్లు గా ఉన్న బ్లాగర్లు దాదాపు 48% వృద్ది రేటుతో 35. మిలియన్లకు చేరారు . 2013 సంవత్సరానికిగాను ఇండీబ్లాగర్ బిజినెస్ వరల్డ్ తో కలిసి నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విడుదలచేసింది . దాదాపు 35,464 బ్లాగులతో ఇండియాలోని ప్రధాన బ్లాగర్ల డైరెక్టరీ అయిన ఇండీబ్లాగర్ తన రిపోర్ట్ లో అనేక ఆసక్తికర అంశాలను బయట పెట్టింది . దీనిలోని ప్రధాన అంశాలు చూద్దాం -
ఇంకా అనేక అంశాలు కలిగిన రిపోర్ట్ క్రింద చూడొచ్చు . - ప్రస్తుతం ఇంటర్నెట్లో లభ్యమవుతున్న కంటెంట్ కు బ్లాగర్లు ప్రధాన మాధ్యమంగా నిలిచారు.
- బ్లాగ్స్ అనేవి ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాల్లో అతి పురాతనమైనవి.
- ఇండియాలో అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు దాదాపు 46% వ్రుద్దిరేటుతో నిలిచాయి .
- బ్లాగులు ప్రస్తుతం ఉన్న మీడియా మాధ్యమాలకు కూడా ఏమాత్రం తీసిపోని రీతిలో వార్తా విశ్లేషణలను అందిస్తూ నమ్మకమైన మాధ్యమంగా నిలిచాయి .
- బ్లాగర్లలో 75% మంది పురుషులే .
- 88% మంది భారత బ్లాగర్లు ఇంగ్లీషులో బ్లాగింగ్ చేస్తుండగా మిగిలిన 12% మందిలో హిందీలో 5%, తమిళ్ లో 3%, తెలుగు, మాలయాళం, మరాఠీ భాషలలో 1% చొప్పున బ్లాగింగ్ చేస్తున్నారు .
- 25-35 వయసువాళ్ళు 54% మంది బ్లాగింగ్ చేస్తుండగా 18 సంవత్సరాల లోపు వాళ్ళు 1% , 18-25 వయసుకలవారు 24% మంది , 35-45 వయసుకలవారు 14% మంది , 45 పైన వయసుకలవారు 7% మంది బ్లాగర్లుగా ఉన్నారు.
- అధ్యధిక ఆదరణ కలిగిన అంశాలుగా ఆహారం , ఆరోగ్యం, సినిమాలు, పుస్తకాలు, సాంకేతిక అంశాలు , ఫోన్లు ఇతర వస్తువుల రివ్యూలు, రాజకీయాలు నిలిచాయి .
- అత్యధిక వృద్దిరేటు కలిగిన అంశాలుగా ఆరోగ్యం, ఎన్నికలు, షాపింగ్ నిలిచాయి
- బెంగళూరు , ముంబైలలో 14% శాతం చొప్పున బ్లాగర్లు ఉండగా చెన్నైలో 10% , ఢిల్లీ, హైదరాబాద్ ( ఆంధ్ర-తెలంగాణా ) లలో 8% ఉన్నారు .
- 86% మంది తమ బ్లాగులను సంపాదనా మార్గంగా ఎంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు .
- 22% మంది బ్లాగింగ్ ను వృత్తిగా భావిస్తున్నారు .
- వస్తువులు కొనుగోలు చేసే శక్తిని దాదాపు 56% బ్లాగులు ప్రభావితం చేస్తున్నాయి.
0 గురు ఇలాగన్నారు...:
Post a Comment