31 December 2011
18 December 2011
Google నుండి ఓ మేజిక్ ::మీ స్క్రీనుపై కురిసే మంచు
గూగుల్ సెర్చ్ ద్వారా ఈ చిన్ని ఫన్నీ మేజిక్ చేస్తారా?
మొదట బ్రవుసర్ లో www.google.com కు వెళ్ళండి
సెర్చ్ అయిటం గా "let it snow" అని టైప్ చేయండి .
ఎంటర్ కొట్టండి ...
అద్భుతం .... మీ స్క్రీను మొత్తం మంచు కురుస్తుంది ...
మంచు ఎక్కువైతే ఎలా? Defrost చేస్తే పోలా? మరెందుకాలస్యం Defrost బటను నొక్కితేసరి ...
బాగుందా మేజిక్ !!

17 December 2011
ఏ ప్రపంచ భాషనైనా తెలుగులో చదవండి ఒక్కనిమిషంలో!!
మీరు అనుక్షణం ఎన్నో వెబ్సైట్లు చూస్తూ ఉంటారు...అవి జపనీస్ కావచ్చు, ఇంగ్లిష్ కావచ్చు, తమిళ్, డచ్, అరబిక్ ఏదైనా కావచ్చు.. ఆ వెబ్సైట్ తెలుగులో ఉంటే ఎంత బాగుణ్ణూ అనుకున్నారా? ఈ ఊహే అద్భుతంగా ఉంది కదూ !!ఇప్పుడా చింత లేదు - ఏ భాషనైనా ఇట్టే సులభంగా తెలుగులోకి అనువదించుకొని చదువుకోవచ్చు...
గూగుల్ ప్రవేశపెట్టీన అనువాదక టూల్ చాల భాషలను తెలుగులోకి కూడా అనువదిస్తుంది...ప్రస్తుతం తెలుగుకి బీటా వర్షన్ ఉండడంవల్ల గ్రామర్ తప్పులు ఉంటే ఉందొచ్చు కానీ అర్ధంచేసుకోవడం సులువే...
ఒకసారి ప్రయత్నించి చూడండి...
ఎంత మజాగా ఉంటుందో...
క్రింది లింక్ క్లిక్ చేసి తర్వాత విండొలోని మొదటి బాక్స్ లో మీరు అనువదించదల్చుకున్న వెబ్సైట్ లేదా బ్లాగు అడ్రస్ పేష్ట్ చేయండి లేదా టైప్ చేసి ఎంటర్ కీ నొక్కండి ...తెలుగు అనువాదం రడీ..
http://translate.google.com/?hl=en&sl=auto&tl=te
చూసారా ప్రపంచమెంత చిన్నిదో?!
మరోసారి కలుద్దాం
11 December 2011
సరికొత్త రూపంలో "బ్లాగిల్లు" : ఇది బ్లాగు చరిత్రలో విప్లవం
"తెలుగు బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్ష"లతో మన తెలుగు ఆగ్రిగేటర్ "బ్లాగిల్లు" పూర్తి క్రొత్త రూపాన్ని సంతరించుకుంది...తెలుగు బ్లాగు చరిత్రలో సరిక్రొత్త విప్లవానికి నాంది పలికింది!
ముఖ్యమైన ఫీచర్లు:
1.WEB 2.0 interface
2.అత్యధిక వేగం
3.వీక్షకులు తమ అకౌంటులు తెరుచుకోవచ్చు. తమకు నచ్చిన న్యూస్ ఫీడ్లను ఎంచుకోవచ్చు.
4.వీక్షకుల క్లిక్ లను బట్టి "ముఖ్య పోస్టులు" ఆటోమేటిక్ గా కూర్చబడుతాయి.
5.అత్యధిక పేజీల్లో ఎక్కువ పోస్టులు వీక్షించే అవకాశం.
6.నచ్చిన పోస్టులను 50 కి పైగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లతో వేగంగా షేరింగ్ చేయవచ్చు.(social nework sharing).
రాబోతున్న ఫీచర్లు:
1.తెలుగు వార్తా పత్రికలనూ ఇక్కడే చూడొచ్చు.
2.అతి ఎక్కువ బ్లాగు ఫీడులు.
3.ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉండడంతో అన్ని బ్లాగుల వీక్షకులూ పెరుగుతారు.తెలుగు బ్లాగర్ల సంఖ్యా పెరుగుతుంది.(Increase of blog traffic)
4.నచ్చిన పోస్టులకు వోటింగ్ చేసే అవకాశం.
5.అత్యధిక విభాగాలు.
.
ఇంకా మరిన్ని సదుపాయాలు,ఫీచర్లు త్వరలో రాబోతున్నవి...
ఈ బ్లాగుల దినోత్సవం తెలుగు బ్లాగర్లకు, బ్లాగు ప్రేమికులకు అనేక అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ....
తెలుగు బ్లాగర్ల దినోత్సవ వేడుకల్ని ఈజీగా లైవ్ టెలీకాస్ట్ చేయొచ్చు ఇలా: ప్రయత్నించండి
ముందుగా అందరికీ తెలుగు బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు
మన ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు లేదా సభలూ, సమావేశాలు కావచ్చు వాటిని చాలా ఈజీగా తక్కువ ఖర్చుతొ లైవ్ టెలీకాస్ట్ చేయొచ్చు. దీనికి మనకు కావల్సింది కేవలం నెట్ సదుపాయం కలిగిన ఒక ఆండ్రాయిడ్ లేదా ఐ-ఫోన్ మాత్రమే.
చాలా మందికి ఎలాగూ ట్విట్టర్ అకౌంట్ ఉండనే ఉంటుంది .
వివరాలకు ఈ వెబ్సైట్ చూడండి :
ప్రేక్షకులు కూడా వారి మొబైల్స్ లోగానీ కంప్యూటర్లో గానీ సులభంగా వీక్షించవచ్చు..
దాన్ని కాస్ట్ చేసేవారు అ లింకును పంపిస్తే సరి ...
మరి ఈ బ్లాగర్ల దినోత్సవ వేడుకల్ని ఈ టెక్నిక్ ద్వారా చేస్తే దూరంగా ఉండి రాలేక పోతున్న మాలాంటి "బ్లాగర్లు" చూడొచ్చుకదా..
youtube డెమో వీడియో లింక్: http://www.youtube.com/watch?v=fInJ4FR6rFk
09 December 2011
తెలుగు బ్లాగర్ మహాశయులకు లేఖ - అందరూ తప్పక చదవండి ప్లీజ్
బ్లాగర్ మహాశయులారా!!!
మన దేశం అనేక భాషలకు, కళలకు,విభిన్న సంస్క్రుతులకు పుట్టినిల్లు..భాషా పరంగా మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు.కానీ బ్లాగర్ల విషయంలో మాత్రం మనము చాలా వెనుకబడి ఉన్నమనే విషయం తెలుసా..? అయినా చెప్పక తప్పదు.
ఇప్పటికీ ఇంగ్లీషులోనే బ్లాగింగ్ చేసే వారిని మినహాయిస్తే హిందీలో అత్యదిక బ్లాగర్లు ఉన్నారు. ఇక హిందీ తర్వాత తమిళ్,గుజరాతీ,మలయాళం బ్లాగర్లు ఎక్కువగా ఉన్నారు.అంతేకాదు ఆయా భాషల్లో ఉత్సాహంగా పోస్టులు చేసే బ్లాగర్ల సంఖ్య కూడా చాలాఎక్కువే! అయాభాషల సగటు బ్లాగ్ పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ...
తెలుగులో ఈ మాత్రమైన బ్లాగర్ల సంఖ్య పెరిగిందంటే ముఖ్య కారణం జల్లెడ, కూడలి, మాలిక, హారం,సంకలిని వంటి బ్లాగు సంకలినులే అని చెప్పక తప్పదు.
మీరు ఒక సారి తమిళ్ బ్లాగ్ ఆగ్రిగేటరులైన http://www.valaipookkal.com/, http://www.tamilmanam.net/, http://www.ulavu.com/,http://www.udanz.com/ లు గానీ
మలయాళీ ఆగ్రిగేటరులైన http://chintha.com/malayalam/blogroll.php, www.cyberjalakam.com/aggr/ లు గానీ
గుజరాతీ ఆగ్రిగేటరైన http://www.neepra.com/ గానీ చూసారా ?
వాటిలో వ్యత్యాసాలు చూసారా? వాటి డిజైన్ , వోటింగ్ సిస్టం , ఫీచర్లు మన తెలుగు ఆగ్రిగేటరులలో ఉన్నాయా ?
ఒకసారి మన జల్లెడ నుంచి సంకలిని వరకూ చూడండి ..
అన్నీ ఒకే మూసలో ( జల్లెడ తప్పించి) " బ్లాగు పేరు: టైటిల్ " చూపిస్తాయి... నన్ను క్షమించండి
మరోసారి నన్ను క్షమించండి .. నిజమా? కాదా ?
మరేమికావాలి అని నన్ను అడుగుతున్నారా ?
నేను చెపుతాను ఒక్క రెండు రోజుల్లో ..!!!
ఈలోగా మీరు చెప్పండి మీకేమి కావాలో...
ఇదేమిటి పోస్టును మద్యలో వదిలేసి మీరు చెప్పండి అంటాడేమిటి అనుకోకండి ప్లీజ్
ఈ పోస్టును కంటిన్యూ చేస్తాను కానీ ఇప్పుడైతే మీరు చెప్పండి మీకేమి కావాలో !!
మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ...
( డిసెంబర్ 11 తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగిల్లు వ్రాస్తున్న వ్యాసం )

Subscribe to:
Posts (Atom)