09 December 2011

తెలుగు బ్లాగర్ మహాశయులకు లేఖ - అందరూ తప్పక చదవండి ప్లీజ్

బ్లాగర్ మహాశయులారా!!!
మన దేశం అనేక భాషలకు, కళలకు,విభిన్న సంస్క్రుతులకు పుట్టినిల్లు..భాషా పరంగా మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు.కానీ బ్లాగర్ల విషయంలో మాత్రం మనము చాలా వెనుకబడి ఉన్నమనే విషయం తెలుసా..? అయినా చెప్పక తప్పదు. 
ఇప్పటికీ ఇంగ్లీషులోనే బ్లాగింగ్ చేసే వారిని మినహాయిస్తే హిందీలో అత్యదిక బ్లాగర్లు ఉన్నారు. ఇక హిందీ తర్వాత తమిళ్,గుజరాతీ,మలయాళం బ్లాగర్లు ఎక్కువగా ఉన్నారు.అంతేకాదు ఆయా భాషల్లో  ఉత్సాహంగా పోస్టులు చేసే  బ్లాగర్ల సంఖ్య కూడా చాలాఎక్కువే! అయాభాషల సగటు బ్లాగ్ పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ...
తెలుగులో ఈ మాత్రమైన బ్లాగర్ల సంఖ్య పెరిగిందంటే ముఖ్య కారణం జల్లెడ, కూడలి, మాలిక, హారం,సంకలిని వంటి బ్లాగు సంకలినులే అని చెప్పక తప్పదు.
మీరు ఒక సారి తమిళ్ బ్లాగ్ ఆగ్రిగేటరులైన http://www.valaipookkal.com/, http://www.tamilmanam.net/, http://www.ulavu.com/,http://www.udanz.com/ లు గానీ

మలయాళీ ఆగ్రిగేటరులైన http://chintha.com/malayalam/blogroll.php, www.cyberjalakam.com/aggr/   లు గానీ


గుజరాతీ   ఆగ్రిగేటరైన http://www.neepra.com/ గానీ చూసారా ?

వాటిలో వ్యత్యాసాలు చూసారా? వాటి డిజైన్ , వోటింగ్ సిస్టం , ఫీచర్లు మన తెలుగు ఆగ్రిగేటరులలో ఉన్నాయా ?
ఒకసారి మన జల్లెడ నుంచి సంకలిని వరకూ చూడండి ..
అన్నీ ఒకే మూసలో ( జల్లెడ తప్పించి) " బ్లాగు  పేరు: టైటిల్ " చూపిస్తాయి... నన్ను క్షమించండి
మరోసారి  నన్ను క్షమించండి  .. నిజమా? కాదా ?
మరేమికావాలి అని నన్ను అడుగుతున్నారా ?
నేను చెపుతాను ఒక్క రెండు రోజుల్లో ..!!!
ఈలోగా మీరు చెప్పండి మీకేమి కావాలో...
ఇదేమిటి పోస్టును మద్యలో వదిలేసి మీరు చెప్పండి అంటాడేమిటి అనుకోకండి ప్లీజ్
ఈ పోస్టును కంటిన్యూ చేస్తాను కానీ ఇప్పుడైతే మీరు చెప్పండి మీకేమి కావాలో !!


మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ...

( డిసెంబర్ 11 తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగిల్లు వ్రాస్తున్న వ్యాసం ) 

13 comments:

పల్లా కొండల రావు said...

every day in every way we will get better and better see new telugu aggrigators : www.bloggersworld.in

Anonymous said...

మీరిచ్చిన లింకుల ప్రకారం చూశాను....నాకైతే మనవే బాగున్నట్లు కనపడినాయి. వాటిలో ప్రత్యెకత ఏమీ లేదు...అవి కొత్తవి అంతే. నాకైతే "సమూహము" లాంటి వెరైటీ పర భాషలలో కనపడలేదు. ఏవైనప్పటికీ మీరిచ్చిన పరభాషా బ్లాగుల లిస్టుల ద్వారా అక్కడ వాటిని చూడగలిగినందుకు మీకు ధన్యవాదాలు.

Anonymous said...

ఇలా రెండు మూడు మంచి సంకలునులు వస్తే బాగుండును. తెలుగులో ఒక్క కూడలి తప్ప ఇంకా మంచి సంకలిని కనిపించడం లేదు. హారం కొద్దిగా పైకివస్తున్న సమయంలో ఇంగ్లీషు బ్లాగల మీదకి దృష్టిమళ్ళించి నాణ్యత చెడగొట్టుకుంది, సంకలిని మొదటి రూపమే బాగుండేది, ఇప్పుడంతా డెజైన్‌ మార్చాక బాలేదు. మాలిక మొత్తం కెలుకుడు బ్లాగుల మయం అయిపోయింది, పొద్దూకులూ ఫ్రియా దెయ్యగారు, రౌడీగారి రాజ్యమూ, వనమూ ఇంకాలేదంటే సమస్యలూ పూరణలూ తప్ప వేరేవేమీ కనిపించడం ళేదు.
కూడలి ఒక్కటే బాగుంది కానీ, కూడలిలో ఎన్ని బ్లాగులని ఉంటాయి, ట్రాఫిక్కూ ఎక్కువే, పోస్టులూ ఎక్కువే .. గట్టినా 5,6 గంటలు కూడలిలో కనిపిస్తే ఒక 2,3 వందల హిట్లొచ్చినట్లే .. కూడలిలో పోస్టులు డిస్ప్లే చేసే నిడివి పెంచాలి.

ఎందుకో ? ఏమో ! said...
This comment has been removed by a blog administrator.
ఎందుకో ? ఏమో ! said...

మాలిక aggregator లో తొలుత నా blog ని add చేద్దామని ప్రయత్నిస్తే must & should తెలుగు contents ఉండాలి అని 1st చూశాక నిరుస్తాహ పడ్డాను
కానీ వీళ్ళ బ్లాగులు అగ్రిగేటర్ లు అన్నీ వాళ్ళ భాషలోనే ఉన్నాయి, మీరన్నట్టుగా technical గా మరింత explore nature వాళ్ళ presentation లో కనిపిస్తుంది
విషయం అర్థం కాకపోయినా వాళ్ళ representation of their language blog contents బాగున్నది
అయితే వాటిలో కొన్ని fund sponsor చేయమని చెప్తున్నాయి మన తెలుగు aggreegators అలా లేదు కానీ కమర్షియల్ కూడా కాదు ఒకటి అరా మినహా !!
కానీ వీటికి
alexa.com ranks చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే

ఎందుకో ? ఏమో ! said...

http://www.ulavu.com/ 31,510


http://www.udanz.com/ 55,222

malayalam http://chintha.com/malayalam/blogroll.php 687,562

http://www.cyberjalakam.com/ 276114


http://www.valaipookkal.com/ 113912

aa gujarathi agrregator kanna mee blog rank takkuva so daani (http://www.neepra.com/)list lonchi teeseyyocchu

ఎందుకో ? ఏమో ! said...

telugu aggreegators

http://maalika.org/
538053

http://www.haaram.com/Default.aspx?ln=te
197496

http://koodali.org/
186,088

http://www.sankalini.org/
561,549

http://samoohamu.com/
67,34,539

http://www.jalleda.com/
12,62,657

http://www.blogillu.com/
32,96,008

?!

Anonymous said...

meerannadi karekte! kaneesam blogger dinostsavam naadaina manavaalu maarataara vechichoodaali

Ranga Naidu said...

okka teluguvi tappa annee design bagunnayi.

Apparao said...

@ ఎందుకో ? ఏమో !,
అలెక్ష రాంకులు ఇచ్చారు బాగుంది
మన తెలుగు అగ్రిగేటర్ లలో కమర్షియల్ వి తక్కువే
సంకలిని లో అయితే ఒక్క ఆడ్ కూడా ఉండదు

>>>అన్నీ ఒకే మూసలో
సంకలిని లో మాత్రం టపా లోని మొదటి ఇమేజ్ , కొంత స్నిప్పెట్ (సారాంశం ), పోస్ట్ చేసిన సమయం ( లోకల్ స్టాండర్డ్ టైం కి కన్వర్ట్ చేసి) ని బట్టి సార్ట్ చేసి చూపిస్తుంది
స్నిప్పెట్ వ్యూ చూడాలా వద్దా అనేది బ్లాగర్ యొక్క ఇష్టం
అడుగు భాగం లో snippet view show/hide అని రెడ్ కలర్ లో ఉంటుంది . దాని మీద క్లిక్ చేస్తే మీరు టపా లోని మొదటి మూడు లైన్స్ చదువు కోవచ్చు

Apparao said...

తమిళం లో బ్లాగర్ లు ఎక్కువ
తమిళ వికిపెడియా తో పోలిస్తే తెలుగు వికేపీడియా తక్కువ
కాబట్టి వాటి అలెక్ష రాంక్ లతో poలిస్తే మనవి తక్కువే

Blogger said...

Apparao Sastri గారూ మెరన్నదికరెక్టే! మన ఆగ్రిగెటర్లు కమర్షియల్ గాలేవు. కానీ ఒకటి నేను అంటాను " ప్రస్తుతప్రపంచంలో ఏ రంగమైతే కమర్షియల్ అయిందో ఆరంగంలో అభివ్రుద్ది ఎక్కువగా ఉంది...( Including educational, media and politics)"

I need dibate on this!

Anonymous said...

www.kootami.co.cc

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...