18 May 2012

అసలు మొబైల్ లో ప్రత్యేకంగా వెబ్సైట్ ఎందుకు?

ప్రతీ వెబ్సైట్ లో ఉండే పేజీల్లో అనేకమైన డేటా ఫైల్స్, ఇమేజెస్, జావా, CSS ఫైళ్ళు ఉంటాయి.ఒక వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసినపుడు ఇవన్నీ లోడ్ అవుతుంటాయి. ఈ ఫైళ్ళ వల్లే ప్రతీ వెబ్సైట్ ఆకర్షణీయంగా కనపడుతుంది.సాధారణ కంప్యూటర్లపై ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసినపుడు ఎంత డేటా ఉపయోగించుకున్నా పరవాలేదు. కానీ KBకి ఇంత అని చార్జ్ చేసే మొబైల్ నెట్వర్క్ లలో ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం బ్లాగుల గురించి మాట్లాడు కుంటున్నాం కనుక మన తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్ ల పేజిల సైజ్ చూద్దాం.
జల్లెడ  - 200.6KB
కూడలి - 266.3 KB
బ్లాగిల్లు - 241.2KB
మాలిక- 277.1KB

హారం - 875.4KB
సంకలిని - 2.5MB( APPROX 2600KB)
బ్లాగిల్లు మొబైల్  - 3.4KB
ఎక్కువ పేజ్ సైజ్ వల్ల ఖర్చు మాత్రమే కాక ఆయా వెబ్సైట్లు లోడ్ అయ్యే సమయం కూడా పెరుగు తుంది.
తెలుగు బ్లాగర్ల సౌకర్యాల కోసం అనేక ప్రయోగాలు చేస్తున్న మీ "బ్లాగిల్లు" ఇప్పుడు మొబైల్ వెబ్ సైట్ గా వచ్చింది. దీని పేజ్ సైజ్ కేవలం దీనివల్ల మొబైల్ యూజర్లు అతితక్కువ ఖర్చుతోనే ఈ వెబ్సైట్ ను వీక్షించవచ్చు. తెలుగు బ్లాగర్లకు ఇది శుభవార్తే కదా..!!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...