బ్లాగు ప్రపంచం కాపీ కాదు అతి కష్టపడి కోడ్ నెట్ లో పట్టుకున్నాం అంటూ కొండలరావుగారు చెప్పారు.
క్రింది లింక్ కూడా ఇచ్చారు .
http://www.mybloggertricks.com/2011/12/customize-buzzboost-change-text.html
దానిలో ఉన్నది ఇదీ :
టపా పై మౌస్ ఉంచితే బాక్ గ్రౌండ్ గ్రీన్ కలర్ వచ్చేలా కేవలం బ్లాగిల్లు కోసం చెసాను. ఎందుకంటే బ్లాగిల్లు కలర్స్ అన్నీ గ్రీన్ కలర్ కనుక క్రింది విధంగా కలర్ మార్చాను . ఆ #e8ffe8 అనే కలర్తో పాటూ కాపీ చేసికొని ఒరిజినల్ లింక్
చూపుతున్నారు .
ఇంకా పైప్స్ అంటూ వ్రాసారు . ముఖ్యం గా నేను చెప్పేది ఒక్కటే మీకు బ్లాగర్ వరల్డ్ ఆధునీకరించాలన్న ఐడియా బ్లాగిల్లు బ్లాగర్ లో పెట్టినప్పుడే ఎందుకు కలిగింది ? ఎందుకంటే పైప్స్ కోడింగ్ దొరికింది కనుక నా పైప్స్ క్లోన్ చేసి మీ ఫీడ్ ఇచ్చుకున్నారు . ఏ రోజు పైప్స్ వాడారో చూసారా అంతకు రెండ్రోజుల ముందే బ్లాగిల్లు బీటా మొదలయింది.
నిజాన్ని ఒప్పుకోడానికి దమ్ము ఉండాలి. అది మీకు లేదు .మీ క్రింది లేఖలు చూపుతున్నాను . ఎందుకంటే నిజాన్ని ఒప్పుకోలేదు కనుక .

తెలుగు ప్రజలు విజ్ఞులు !!!
వారికంటే బ్లాగర్లు ఏ మాత్రం తీసిపోరు . అర్ధం చేసుకుంటారు !!!
మీరు కోడ్ వాడుకోండి . ఉన్నది ఉన్నట్లు వాడుకోండి . కానీ అబద్దాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయకండి .
కోడ్ నెట్ లో దొరకవచ్చు . కానీ దాని ఉపయోగించుకునే ముందు అది ఎవరు తయారు చేసారో వారని సంప్రదించి అనుమతి తీసుకోవడం విజ్ఞత అని ముందే చెప్పాను . యాహూ పైప్స్ లో మీరు వాడుతున్న పైప్ నేను స్వంతంగా తయారు చేసుకున్నదే కానీ కొట్టుకొచ్చింది కాదు . మీరు టపాలకు , వ్యాఖ్యలకు వాడుతున్న పైప్ నాదే అని ఖచ్చితంగా చెప్పగలను . అది మీకూ తెలుసు
పైప్స్ వాడుకోవడం ఉచితమే కానీ మనం తయారు చేసుకున్నది పబ్లిష్ చేసేవరకూ ఎవరికీ తెలీదు . మనం చెపితే తప్ప ! మరి మీకు ఎలా దొరికింది . బ్లాగిల్లు నుండి తీసుకున్నది కాదా ?
ఇకపై వాడను అన్న మీరు వాడి మీది కాదు అనడం ఎ విధంగా విజ్నతో మీ అంతరాత్మకే తెలియాలి