Showing posts with label blogger. Show all posts
Showing posts with label blogger. Show all posts

21 August 2014

అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014

       ఇంటర్నెట్ మాధ్యమాలలో బ్లాగర్లు తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు . 2012 లో 24.3 మిలియన్లు గా ఉన్న బ్లాగర్లు దాదాపు 48% వృద్ది రేటుతో 35. మిలియన్లకు చేరారు . 2013 సంవత్సరానికిగాను ఇండీబ్లాగర్ బిజినెస్ వరల్డ్ తో కలిసి నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విడుదలచేసింది . దాదాపు 35,464 బ్లాగులతో ఇండియాలోని ప్రధాన బ్లాగర్ల డైరెక్టరీ అయిన ఇండీబ్లాగర్ తన రిపోర్ట్ లో అనేక ఆసక్తికర అంశాలను బయట పెట్టింది . దీనిలోని ప్రధాన అంశాలు చూద్దాం -
  • ప్రస్తుతం ఇంటర్నెట్లో లభ్యమవుతున్న కంటెంట్ కు బ్లాగర్లు ప్రధాన మాధ్యమంగా నిలిచారు. 
  • బ్లాగ్స్ అనేవి ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాల్లో అతి పురాతనమైనవి. 
  • ఇండియాలో అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా  బ్లాగులు దాదాపు 46% వ్రుద్దిరేటుతో నిలిచాయి . 
  • బ్లాగులు ప్రస్తుతం ఉన్న మీడియా మాధ్యమాలకు కూడా ఏమాత్రం తీసిపోని రీతిలో వార్తా విశ్లేషణలను అందిస్తూ నమ్మకమైన మాధ్యమంగా నిలిచాయి . 
  • బ్లాగర్లలో 75% మంది పురుషులే . 
  • 88% మంది భారత బ్లాగర్లు ఇంగ్లీషులో బ్లాగింగ్ చేస్తుండగా మిగిలిన 12% మందిలో హిందీలో 5%, తమిళ్ లో 3%, తెలుగు, మాలయాళం, మరాఠీ భాషలలో 1% చొప్పున బ్లాగింగ్ చేస్తున్నారు . 
  • 25-35 వయసువాళ్ళు 54% మంది బ్లాగింగ్ చేస్తుండగా 18 సంవత్సరాల లోపు వాళ్ళు 1% , 18-25 వయసుకలవారు 24% మంది , 35-45 వయసుకలవారు 14% మంది , 45 పైన వయసుకలవారు 7% మంది బ్లాగర్లుగా ఉన్నారు. 
  • అధ్యధిక ఆదరణ కలిగిన అంశాలుగా ఆహారం , ఆరోగ్యం, సినిమాలు, పుస్తకాలు, సాంకేతిక అంశాలు , ఫోన్లు ఇతర వస్తువుల రివ్యూలు, రాజకీయాలు  నిలిచాయి .
  • అత్యధిక వృద్దిరేటు కలిగిన అంశాలుగా ఆరోగ్యం, ఎన్నికలు, షాపింగ్ నిలిచాయి 
  • బెంగళూరు , ముంబైలలో 14% శాతం చొప్పున బ్లాగర్లు ఉండగా చెన్నైలో 10% , ఢిల్లీ,  హైదరాబాద్ ( ఆంధ్ర-తెలంగాణా ) లలో 8% ఉన్నారు . 
  • 86% మంది తమ బ్లాగులను సంపాదనా మార్గంగా ఎంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు . 
  • 22% మంది బ్లాగింగ్ ను వృత్తిగా భావిస్తున్నారు . 
  • వస్తువులు కొనుగోలు చేసే శక్తిని   దాదాపు 56% బ్లాగులు  ప్రభావితం చేస్తున్నాయి. 
 ఇంకా అనేక అంశాలు కలిగిన రిపోర్ట్ క్రింద చూడొచ్చు .

02 November 2013

మీ బ్లాగును సెర్చ్ ఇంజన్లు గుర్తించేలా చేసుకోండిలా

సెర్చ్ ఇంజన్లు గుర్తించకపోతే ఎన్ని టపాలు వ్రాసినా చదివేవారు ఉండరు కదా... మనను ఏ టాపిక్ పై టపా వ్రాసినా ఎప్పుడో ఇకసారి సెర్చ్ ఇంజన్లద్వారా వెతికి మన టపా చదివేలగ ఉందాలి. లేకపోతే ఆగ్రిగేటర్లలో కనపడే ఆ కొద్ది గంటలు మాత్రమే కొందరు చదివగలరు ఆ తర్వాత ఆ టపా మరుగున పడిపోతుంది. ఎప్పటికీ టపా చదివేలాగ ఉండాలంటే సెర్చ్ ఇంజన్లకు దొరకాలి . అలా చేయాలంటే క్రింది సెట్టింగ్స్ మీ బ్లాగర్ డేష్ బోర్డ్ లో చేయండి.


ముందుగా బ్లాగర్ డేష్బోర్డ్ లో బ్లాగు సెట్టింగ్స్ కు వెళ్ళీ Search Preferences ఆప్షన్ ను ఎంచుకోండి. Description ను ఎనేబుల్ చేసి ఒక మంచి డెస్క్రిప్షన్ మీ బ్లాగుకు ఇవ్వండి.


ఇలా చేయడంవల్ల ఇకపై మీరు టపాలు వ్రాసేటప్పుడు ప్రక్కన Post ఆప్షన్లలో అని వస్తుంది. దానిలో మీ టపా టైటిల్ లేదా ఆ టపా గురించిన సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు.


ఆ తర్వాత ముఖ్యంగా చేయవల్సినది బ్లాగు టెంప్లేట్ హెడర్ లో మార్పులు. ఇవి చెయ్యకపోతే మీరు మార్చినా ప్రయోజనంలేదు.
అదెలా అంటే మీ టెంప్లేట్ ఏడిట్ లో అని ఉంటుంది. దాని పైన క్రింది విధంగా ఉండాలి లేకపోతే ఈ కోడ్ ను పేస్టే చేసి సేవ్ చేయండి.

<b:include data='blog' name='all-head-content'/>
	<title>
		<b:if cond='data:blog.pageType == &quot;index&quot;'>
			<data:blog.pageTitle/>
		<b:else/>
			<b:if cond='data:blog.pageType != &quot;error_page&quot;'>
				<data:blog.pageName/> | <data:blog.title/>
			<b:else/>
				404 | <data:blog.title/> 
			</b:if>
		</b:if>
    </title>
	<b:if cond='data:blog.metaDescription == &quot;&quot;'>
		<meta expr:content='data:blog.pageName + &quot; - &quot; + data:blog.title' name='description'/>
	<b:else/>
		<meta expr:content='data:blog.metaDescription' name='description'/>			
	</b:if>
 ( గమనిక : పై మార్పులు చేసే ముందు మీ టెంప్లేట్ ను బేక్ అప్ తీసుకోవడం మర్చిపోవద్దు. పై కోడ్ మర్పు చేసే ముందు ఇప్పటికే ఇలాంటి కోడ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న డెస్క్రిప్షన్ , కీ వర్డ్ మెటా టేగ్స్ ను తొలగించండి.)
Source: http://bloggeritems.com నుండి సేకరించబడిన సమాచారం ఆధారంగా పరిశోధన చేసిన పిదప వ్రాయబడినది. ...
 
 
Related Posts Plugin for WordPress, Blogger...