16 July 2014

"బ్లాగిల్లు" కోడ్ ను కాపీ చేసుకున్న ప్రభుద్దులు - వీరు మారరు

బ్లాగిల్లు 'క్రొత్త వర్షన్ ' ఇదే బ్లాగుపై తయారుచేసి మీ అందరి పరీక్షకోసం పెట్టినవిషయం తెలుసు కదా ?
బ్లాగర్ లోని లూప్ హోల్స్ పసిగట్టిన కొందరు దాని కోడ్ ను హ్యాక్ చేసి తాము కాపీ చేసికొని తమ సంకలినిలో ఉపయోగించారు . ఇంతాకాలం ఆ సంకలిని అని చెప్పుకొనే బ్లాగు  బ్లాగు లిస్ట్ అనే విడ్జెట్ పై పనిచేసేది . వారికి కోడ్ దొరికిందే తడవు వినియోగించుకోడానికి వెనుకాడలేదు . ఈ విషయం తెలిసిన నేను వారికి ఎన్నో  మెయిల్స్ చేసాను . వారు కోడ్ వాడము  అని మాట ఇచ్చారు . కానీ మాట తప్పి అదే కోడ్ కనీసం css కూడా మార్చకుండా వాడుతున్నారంటే వారి యొక్క విజ్ఞత, సంస్కారం అర్ధం చేసుకోవచ్చు . ఈ విషయమై వారు ఎన్నైనా చెప్పొచ్చు కానీ వారి గుండెలపై చెయ్యి వేసుకొని స్వంత కోడ్ అని చెప్పగలరా ?
వీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న అనేక బ్లాగులు ఇతరుల నుంచి  కాపీ చేసిన, చోరీ చేసిన templates,కోడ్, పోస్టులతో నిండి పోయి ఉన్నాయి. ఇక ఇది వారికి అసాధ్యమా ?
అందుకే ప్రస్తుతానికి బ్లాగిల్లు టెస్ట్ వెర్షన్ ( రోజుకి అనేక వీక్షకులు వస్తున్నప్పటికీ )  నిలుపుచేసాను . త్వరలో మంచి మంచి శీర్షికలు ... విభాగాలతో మీ ముందు ఉంచుతాను . అందాకా పాత బ్లాగిల్లు నే చూడగలరు .

8 comments:

Anonymous said...

బ్లాగు మొత్తాన్నే కాపీ చేసేస్తున్న సంఘటనలు అనేకం . ఇదో లెక్కా ? అయినా ఎవరండా వాళ్ళు ..

Paper Tiger said...

అవును ఇప్పుడే చూసాను . బ్లాగిల్లు ద్వారా తెలుగు బ్లాగులోకానికి ఎనలేని సేవలందించిన మీకు ద్రోహం చేసారంటే అది క్షమించరాని నేరం ... ఆమధ్య వారి ప్రజా బ్లాగులో వారి ప్రశ్నకు జవాబిస్తూ నేను బ్లాగిల్లు , జల్లెడ లను ఎందుకు ప్రోత్సహించలేదు అంటే 'పరిది' అంటూ ఎదో వాగారు . వారి పరిధి ఇప్పుడు నాకు అర్ధమైంది .

srinivasrjy said...

దయచేసి anonymous కామెంట్లని వ్రాయకండి. "వాళ్ళు" నేనే వ్రాస్తున్నానుకుంటారు

nvk said...

Why can't you proceed legally ?

Zilebi said...

ఔరా , గ్రంధ చోర్యం గురించి చదివి వున్నా కాని ఇట్లా, సైట్లు సైట్లే కాపీ కొట్టేస్తూ ఉన్నారన్న మాట !!

అంతా విష్ణు మాయ !

శ్రీ నివాస్ గారు, మీ సైటు లో కొంత గార్బేజ్ పెట్టి చూడండి --> అది కూడా వారు కాపీ కొట్టేస్తారేమో మరి అప్పుడు బయలు బండారం అవుతుంది !!

చీర్స్
జిలేబి

Anonymous said...

అయినా వారి [మనం చోరీ చేసారు అనుకుంటున్నవాళ్ల] సమాధానం కూడా చూడాలి కదా? కోడ్ వారిదా? లేక కాపీ కొట్టారా అని తెలియడానికి.ఒకే రకం ఉండవచ్చు కదా?

sarma said...

ఎవరు చేసినా తప్పు తప్పే

Bhardwaj Velamakanni said...

ఈ గొడవ ఏ మూడు నాలుగేళ్ళ క్రితమో అయ్యుంటే వేరే సంగతి. I think the Telugu blogs are almost dead now. Jai Facebook :)

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...