శరణు శరణయా జానకి రామ
శరణు శరణయా జానకిరామ కరుణ జూపవా మారుతిపై -
సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ॥
1చ|| కలనైన నిను కొలిచె నేను కయ్యాని కెటులోర్తురా
రాచరికానికి హృదయమె లేని నెయ్యాని కెడమియ్యవా
ప్రేమ నిధాన న్యాయమిదేనా - ఇంకేల ఈశోధన ॥శర॥
2చ॥ భక్తుల బ్రోచె వరదుడ వీవె భారము నీదెనయా
ఏలినవే వారికి చేసిన సేవ నామొర ఆలింపవా
దాసుని దోషము దండముతో సరి బండనమేలనయా ॥శరణు|
No comments:
Post a Comment