17 January 2012

కేవలం Rs.999/-కే 3G మోడెం 3GB ఉచిత డేటాతో పొందడం ఇలా!

ఆశ్చర్యంగా ఉందా?
ప్రస్తుతం మార్కెట్ లో అయిర్  సెల్ కంపెనీ కేవలం Rs.999/-కే 3GBఉచితడేటాతో నెలరోజులపాటు వాడుకొనేవిధంగా 3Gడేటా కార్డులు ఇస్తోంది...వీటిని ఆ నెట్వర్క్ తప్ప మరో దానిలో సిగ్నల్ రాకుండా లాక్ చేసేసారు. నెలతర్వాత వీటిని 3Gఆఫర్లతో మళ్ళీ  రీచార్జ్ చేసుకోవాలి. ఈ రేట్లు ఇలా ఉన్నాయి.
3GB -Rs.625/-
10GB - Rs.1250/-
నార్మల్ గా : 15ps/20kb



అంటే మొదటినెల తక్కువకేఇచ్చినట్లిచ్చి రెండోనెలనుండీ వారి డేటా రేట్లతో మనపై రుద్దుతారన్నమాట..!
ముందుగా ఆ డేటా కార్డ్ ప్రత్యేకతలు తెలుసు కుందాం.
  • 2G/3G కంపేటిబుల్ 
  • మెమొరీ కార్డ్ పెట్టుకోవచ్చు.
  • మెస్సేజ్ లు కంప్యూటర్ నుండే పంపొచ్చు.
  • కాల్స్ కంప్యూటర్ నుండే చేయోచ్చు.
  • డేటా యూజేజ్ చెక్ చేసుకోవచ్చు.
ఇక 2G లో నైతే రేట్లు చాలా తక్కువకు ఉన్నాయి. 3GBడేటా కేవలం Rs.99 కే లభిస్తుంది. 
ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ డేటా కార్డ్కి ఉన్న లాక్ మార్కెట్ లో, మనం డేటా కార్డ్ తీసుకున్న దగ్గరే Rs.100/- కు తీసి ఇస్తున్నారు. ఆతర్వాత మనం ఏ SIM (2G లేదా 3G ) అయినా వేసుకొని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇదే డేటా కార్డు మనం విడిగా కొనాలంటే దాదాపు Rs.1500 - Rs.2000 ఉంది.
కాకపొతే ఈ లాక్ తీస్తే దాటా కార్డ్ వారంటీ పోతుంది. ఉచిత డేటా ని రద్దుచేసే అవకాశం ఉంది.
కనుక నెలరోజులు ఉపయోగించాక ఈ లాక్ మీ అంతట మీరే చాలా ఈజీ గా తీసేయవచ్చు .
వారంటీ పోయినా పర్వాలేదనుకున్న వాళ్ళు ఇక చదవండి:
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి .**** అని ఉన్న చోట మీ కార్డ్ యొక్క 15 అంకెల IMEI నంబర్ని మార్చి ఎంటర్ చేయండి.

http://www.bb5.at/huawei.php?imei=*****

ఎప్పుడు క్రింది విదంగా మీ లాక్ కోడులు వస్తాయి ...

IMEI: 355013047996155

Entsperren / Unlock: 44728452
Flashen / Flash: 53954783

(c) SERGEY/MKL 2010 



unlock: అని ఉన్నదే మీ లాక్ కోడ్ . 

ఇప్పుడు మీ డేటా కార్డ్ లో వేరే SIM ( aircel కానిది ) పెట్టి పోర్ట్ లో డేటా కార్డ్ పెడితే ఆటోమేటిక్ గా లాక్ కోడ్ అడుగుతుంది. అప్పుడు పైన వచ్చిన లాక్ కోడ్ ను ఎంటర్ చేస్తే లాక్ ఓపెన్ అయినట్లే ..
లాక్ కోడ్ కనుక 8 సార్లు కన్నా ఎక్కువగా తప్పుగా ఇస్తే మొత్తం లార్డ్ బ్లాక్ అవుతుంది.
చివరిగా ఓ విషయం: మార్కెట్ లో Rs.100- Rs200 మనదగ్గర లాక్ తీయడానికి గుంజుతున్నారని ఈ విషయం చెప్పా గానీ ఇలా చేయడం నిజానికి నేరం కావచ్చు. తర్వాత మీ ఇష్టం.
ఎంతయినా మన జాగర్తలో మనం ఉండాలిగా .












31 December 2011

Happy New Year 2012


posted from Bloggeroid

18 December 2011

Google నుండి ఓ మేజిక్ ::మీ స్క్రీనుపై కురిసే మంచు

గూగుల్ సెర్చ్ ద్వారా ఈ చిన్ని ఫన్నీ మేజిక్ చేస్తారా?

మొదట బ్రవుసర్ లో www.google.com  కు వెళ్ళండి

సెర్చ్ అయిటం గా "let it snow" అని టైప్ చేయండి .

ఎంటర్ కొట్టండి ...




అద్భుతం .... మీ స్క్రీను మొత్తం మంచు కురుస్తుంది ...

మంచు ఎక్కువైతే ఎలా? Defrost చేస్తే పోలా? మరెందుకాలస్యం Defrost బటను నొక్కితేసరి ...



బాగుందా మేజిక్ !!

17 December 2011

ఏ ప్రపంచ భాషనైనా తెలుగులో చదవండి ఒక్కనిమిషంలో!!



               మీరు అనుక్షణం ఎన్నో వెబ్సైట్లు చూస్తూ ఉంటారు...అవి జపనీస్ కావచ్చు, ఇంగ్లిష్ కావచ్చు, తమిళ్, డచ్, అరబిక్ ఏదైనా కావచ్చు.. ఆ వెబ్సైట్ తెలుగులో ఉంటే ఎంత బాగుణ్ణూ అనుకున్నారా? ఈ ఊహే అద్భుతంగా ఉంది కదూ !!ఇప్పుడా చింత లేదు - ఏ భాషనైనా ఇట్టే సులభంగా తెలుగులోకి అనువదించుకొని చదువుకోవచ్చు...
               గూగుల్ ప్రవేశపెట్టీన అనువాదక టూల్ చాల భాషలను తెలుగులోకి కూడా అనువదిస్తుంది...ప్రస్తుతం తెలుగుకి బీటా వర్షన్ ఉండడంవల్ల గ్రామర్ తప్పులు ఉంటే ఉందొచ్చు కానీ అర్ధంచేసుకోవడం సులువే...
ఒకసారి ప్రయత్నించి చూడండి...
              ఎంత మజాగా ఉంటుందో...
              క్రింది లింక్ క్లిక్ చేసి తర్వాత విండొలోని మొదటి బాక్స్ లో మీరు అనువదించదల్చుకున్న వెబ్సైట్ లేదా బ్లాగు అడ్రస్ పేష్ట్ చేయండి లేదా టైప్ చేసి ఎంటర్ కీ నొక్కండి ...తెలుగు  అనువాదం రడీ..

http://translate.google.com/?hl=en&sl=auto&tl=te

చూసారా ప్రపంచమెంత చిన్నిదో?!



మరోసారి కలుద్దాం
Related Posts Plugin for WordPress, Blogger...