16 July 2014

"బ్లాగిల్లు" కోడ్ ను కాపీ చేసుకున్న ప్రభుద్దులు - వీరు మారరు

బ్లాగిల్లు 'క్రొత్త వర్షన్ ' ఇదే బ్లాగుపై తయారుచేసి మీ అందరి పరీక్షకోసం పెట్టినవిషయం తెలుసు కదా ?
బ్లాగర్ లోని లూప్ హోల్స్ పసిగట్టిన కొందరు దాని కోడ్ ను హ్యాక్ చేసి తాము కాపీ చేసికొని తమ సంకలినిలో ఉపయోగించారు . ఇంతాకాలం ఆ సంకలిని అని చెప్పుకొనే బ్లాగు  బ్లాగు లిస్ట్ అనే విడ్జెట్ పై పనిచేసేది . వారికి కోడ్ దొరికిందే తడవు వినియోగించుకోడానికి వెనుకాడలేదు . ఈ విషయం తెలిసిన నేను వారికి ఎన్నో  మెయిల్స్ చేసాను . వారు కోడ్ వాడము  అని మాట ఇచ్చారు . కానీ మాట తప్పి అదే కోడ్ కనీసం css కూడా మార్చకుండా వాడుతున్నారంటే వారి యొక్క విజ్ఞత, సంస్కారం అర్ధం చేసుకోవచ్చు . ఈ విషయమై వారు ఎన్నైనా చెప్పొచ్చు కానీ వారి గుండెలపై చెయ్యి వేసుకొని స్వంత కోడ్ అని చెప్పగలరా ?
వీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న అనేక బ్లాగులు ఇతరుల నుంచి  కాపీ చేసిన, చోరీ చేసిన templates,కోడ్, పోస్టులతో నిండి పోయి ఉన్నాయి. ఇక ఇది వారికి అసాధ్యమా ?
అందుకే ప్రస్తుతానికి బ్లాగిల్లు టెస్ట్ వెర్షన్ ( రోజుకి అనేక వీక్షకులు వస్తున్నప్పటికీ )  నిలుపుచేసాను . త్వరలో మంచి మంచి శీర్షికలు ... విభాగాలతో మీ ముందు ఉంచుతాను . అందాకా పాత బ్లాగిల్లు నే చూడగలరు .

06 July 2014

యూట్యూబ్ వీడియోలను MP 3 గా మార్చాలా ?

యూట్యూబ్ లో వచ్చే వీడియోలనుంచి ఒక్కోసారి కేవలం ఆడియో మాత్రమె డౌన్లోడ్  చేసుకోవాల్సిన అవసరం రావచ్చు . అప్పుడు ఎలా ?
ప్రస్తుతం దీనికి అనేక వెబ్ సైటులు ఆన్లైన్ కన్వర్టర్లుగా ఉన్నాయి . వీటికి యూట్యూబ్ వెబ్ అడ్రెస్స్ ను ఇస్తే MP3 గా మార్చి డౌన్లోడ్ లింక్ మనకు ఇస్తాయి . నేను చాలా సైటులను ట్రై చెసాను. కానీ నాకు నచ్చిన సైట్ మాత్రం http://convert2mp3.net/ అనేది . ఇది అతివేగంగా ఆడియోగా మార్చడంతో పాటూ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తుంది. చాలా సైట్లలాగా దీనిలో advertisements గొడవ కూడా లేదు. అంతేకాదు రోజుకి ఇన్నే చేయాలి అనే రెస్త్రిక్షన్ కూడా లేదు . మీరూ ట్రై చేయండి ...
Related Posts Plugin for WordPress, Blogger...