31 December 2012

బ్లాగర్లకు ఉపయోగపడే లింక్

ముందుగా తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
                 WISH YOU HAPPY NEW YEAR 2013



18 May 2012

అసలు మొబైల్ లో ప్రత్యేకంగా వెబ్సైట్ ఎందుకు?

ప్రతీ వెబ్సైట్ లో ఉండే పేజీల్లో అనేకమైన డేటా ఫైల్స్, ఇమేజెస్, జావా, CSS ఫైళ్ళు ఉంటాయి.ఒక వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసినపుడు ఇవన్నీ లోడ్ అవుతుంటాయి. ఈ ఫైళ్ళ వల్లే ప్రతీ వెబ్సైట్ ఆకర్షణీయంగా కనపడుతుంది.సాధారణ కంప్యూటర్లపై ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసినపుడు ఎంత డేటా ఉపయోగించుకున్నా పరవాలేదు. కానీ KBకి ఇంత అని చార్జ్ చేసే మొబైల్ నెట్వర్క్ లలో ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం బ్లాగుల గురించి మాట్లాడు కుంటున్నాం కనుక మన తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్ ల పేజిల సైజ్ చూద్దాం.
జల్లెడ  - 200.6KB
కూడలి - 266.3 KB
బ్లాగిల్లు - 241.2KB
మాలిక- 277.1KB

హారం - 875.4KB
సంకలిని - 2.5MB( APPROX 2600KB)
బ్లాగిల్లు మొబైల్  - 3.4KB
ఎక్కువ పేజ్ సైజ్ వల్ల ఖర్చు మాత్రమే కాక ఆయా వెబ్సైట్లు లోడ్ అయ్యే సమయం కూడా పెరుగు తుంది.
తెలుగు బ్లాగర్ల సౌకర్యాల కోసం అనేక ప్రయోగాలు చేస్తున్న మీ "బ్లాగిల్లు" ఇప్పుడు మొబైల్ వెబ్ సైట్ గా వచ్చింది. దీని పేజ్ సైజ్ కేవలం దీనివల్ల మొబైల్ యూజర్లు అతితక్కువ ఖర్చుతోనే ఈ వెబ్సైట్ ను వీక్షించవచ్చు. తెలుగు బ్లాగర్లకు ఇది శుభవార్తే కదా..!!

15 May 2012

తెలుగు బ్లాగు పోస్టులు లైవ్ లో ...

క్రింది లింక్ లో వివరాలు చూడండి

http://blogillu.blogspot.in/2012/05/blog-post.html

18 April 2012

తెలుగు బ్లాగర్లకు శుభవార్త : మీకోసం తెలుగు బ్లాగ్ ర్యాంకింగ్స్


తెలుగు బ్లాగుల డైరెక్టరీ మరియూ ర్యాంకింగ్స్ వెబ్ సైట్ ప్రారంభమయింది 
వివరాలకు ఈ ఫొస్టు ఛూడండి...( Recommended )
లేదా
ఇక్కడినుండి ఆ వెబ్ సైటుకు చేరుకోండి.

16 April 2012

తెలుగు బ్లాగుల ర్యాంకింగ్స్ వెబ్ సైట్ ప్రారంభం కాబోతుంది

 మీ విలువైన అభిప్రాయాల కోసం...బీటా వెర్షన్
క్రింది లింక్ ద్వారా చేరుకోండి ...

< ఇక్కడ క్లిక్ చేయండి >>

19 February 2012

నా బ్లాగును దొంగిలించారు బాబోయ్ !!( అందరూ చదవండి ప్లీజ్)


తెలుగు బ్లాగరుల్లో చాలామంది దొంగలున్నారు. వింతగాచూడకండి.. మన పోస్టులు దొంగిలించే వాళ్ళని దొంగలుకాక మరేమనాలి?
ఏదైనా చెప్పి తీసుకుంటే సభ్యత.
తీసుకున్నతర్వాత చెపితే గౌరవం
తీసేసుకొని చెప్పకుండా,కనీసం ఎవరీకీ తెలియజేయకుండా ఉండడం " దొంగతనం " ..కాక మరేమిటి?
దీనికి ఏ శిక్ష వేయాలో బ్లాగు గురువులూ , సీనియర్లూ , వీక్షకులూ చెపితే బాగుంటుంది.
ఈ మధ్య ఈ బ్లాగు దొంగతనాలు పెరిగిపోయాయి..
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకానొక దొంగ నా బ్లాగు పోస్టులు మొత్తం కాపీ కొట్టేసారు...

కావాలంటే చూడండి
నా బ్లాగు : http://te-android.blogspot.in
దొంగగారి బ్లాగు : http://ablogbykiran.blogspot.in

17 January 2012

కేవలం Rs.999/-కే 3G మోడెం 3GB ఉచిత డేటాతో పొందడం ఇలా!

ఆశ్చర్యంగా ఉందా?
ప్రస్తుతం మార్కెట్ లో అయిర్  సెల్ కంపెనీ కేవలం Rs.999/-కే 3GBఉచితడేటాతో నెలరోజులపాటు వాడుకొనేవిధంగా 3Gడేటా కార్డులు ఇస్తోంది...వీటిని ఆ నెట్వర్క్ తప్ప మరో దానిలో సిగ్నల్ రాకుండా లాక్ చేసేసారు. నెలతర్వాత వీటిని 3Gఆఫర్లతో మళ్ళీ  రీచార్జ్ చేసుకోవాలి. ఈ రేట్లు ఇలా ఉన్నాయి.
3GB -Rs.625/-
10GB - Rs.1250/-
నార్మల్ గా : 15ps/20kb



అంటే మొదటినెల తక్కువకేఇచ్చినట్లిచ్చి రెండోనెలనుండీ వారి డేటా రేట్లతో మనపై రుద్దుతారన్నమాట..!
ముందుగా ఆ డేటా కార్డ్ ప్రత్యేకతలు తెలుసు కుందాం.
  • 2G/3G కంపేటిబుల్ 
  • మెమొరీ కార్డ్ పెట్టుకోవచ్చు.
  • మెస్సేజ్ లు కంప్యూటర్ నుండే పంపొచ్చు.
  • కాల్స్ కంప్యూటర్ నుండే చేయోచ్చు.
  • డేటా యూజేజ్ చెక్ చేసుకోవచ్చు.
ఇక 2G లో నైతే రేట్లు చాలా తక్కువకు ఉన్నాయి. 3GBడేటా కేవలం Rs.99 కే లభిస్తుంది. 
ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ డేటా కార్డ్కి ఉన్న లాక్ మార్కెట్ లో, మనం డేటా కార్డ్ తీసుకున్న దగ్గరే Rs.100/- కు తీసి ఇస్తున్నారు. ఆతర్వాత మనం ఏ SIM (2G లేదా 3G ) అయినా వేసుకొని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇదే డేటా కార్డు మనం విడిగా కొనాలంటే దాదాపు Rs.1500 - Rs.2000 ఉంది.
కాకపొతే ఈ లాక్ తీస్తే దాటా కార్డ్ వారంటీ పోతుంది. ఉచిత డేటా ని రద్దుచేసే అవకాశం ఉంది.
కనుక నెలరోజులు ఉపయోగించాక ఈ లాక్ మీ అంతట మీరే చాలా ఈజీ గా తీసేయవచ్చు .
వారంటీ పోయినా పర్వాలేదనుకున్న వాళ్ళు ఇక చదవండి:
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి .**** అని ఉన్న చోట మీ కార్డ్ యొక్క 15 అంకెల IMEI నంబర్ని మార్చి ఎంటర్ చేయండి.

http://www.bb5.at/huawei.php?imei=*****

ఎప్పుడు క్రింది విదంగా మీ లాక్ కోడులు వస్తాయి ...

IMEI: 355013047996155

Entsperren / Unlock: 44728452
Flashen / Flash: 53954783

(c) SERGEY/MKL 2010 



unlock: అని ఉన్నదే మీ లాక్ కోడ్ . 

ఇప్పుడు మీ డేటా కార్డ్ లో వేరే SIM ( aircel కానిది ) పెట్టి పోర్ట్ లో డేటా కార్డ్ పెడితే ఆటోమేటిక్ గా లాక్ కోడ్ అడుగుతుంది. అప్పుడు పైన వచ్చిన లాక్ కోడ్ ను ఎంటర్ చేస్తే లాక్ ఓపెన్ అయినట్లే ..
లాక్ కోడ్ కనుక 8 సార్లు కన్నా ఎక్కువగా తప్పుగా ఇస్తే మొత్తం లార్డ్ బ్లాక్ అవుతుంది.
చివరిగా ఓ విషయం: మార్కెట్ లో Rs.100- Rs200 మనదగ్గర లాక్ తీయడానికి గుంజుతున్నారని ఈ విషయం చెప్పా గానీ ఇలా చేయడం నిజానికి నేరం కావచ్చు. తర్వాత మీ ఇష్టం.
ఎంతయినా మన జాగర్తలో మనం ఉండాలిగా .












Related Posts Plugin for WordPress, Blogger...