Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

30 August 2025

భారత్ జిడిపి 7.8%: మన అభివృద్దే మనకి ముప్పు తెస్తోందా?!

 

 "డెడ్ ఎకానమీ" గా ట్రంప్ వర్ణించిన భారత్ ప్రస్తుత జిడిపి వృద్ది రేటు 7.8% అని రాత్రి చదవగానే నా మనసులో  కొన్ని అనుమానాలు వచ్చాయి... 

వార్తల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్! 

https://andamanpartners.com/wp-content/uploads/2025/08/Indias-Phenomenal-Growth-Trajectory-ANDAMAN-PARTNERS-2025-800x533.png 

అమెరికా జిడిపి వృద్దిరేటు కేవలం 2.1% మాత్రమే ...

 

 మరోవైపు అన్ని రంగాల్లో రికార్డులు సృష్టిస్తోన్న భారత్ 

 

అదీ కాక నిన్న కాక మొన్న పాకిస్తాన్ తో పాటూ యుద్దంలో భంగపాటుకు గురైన అమెరికా.. యుద్దాన్ని తానే అపానని  చెప్పుకుని ఫూల్ అయిన ట్రంప్ 

 

వీటన్నింటినీ మనసులో పెట్టుకుని రష్యా నుంచి ఆయిల్ కొంటుందన్న సాకుతో భారత్ పై టారిఫ్ అనే యుద్దాన్ని ప్రకటించాడు 

https://static.toiimg.com/thumb/msid-123539032,imgsize-1180826,width-400,resizemode-4/123539032.jpg 

నిజానికి భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్స్ కొంటున్న చైనా, తమ మిత్ర దేశాలపై విధించనంత టారిఫ్ 50% విధించాడు. 

ఇదే విధంగా అభివృద్ధి చెందితే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశం కావచ్చు అని అమెరికా ఆర్ధికవేత్తలు హెచ్చరించి ఉండొచ్చు. అందుకే ఇండియాను కట్టడి చేసే మార్గాలను వెతుక్కున్తున్నది అమెరికా.

ఒకవైపు మన దేశాన్ని అస్థిర పరిచందుకు పాకిస్తాన్ తో దోస్తీ.. మరోవైపు వాణిజ్య ఆంక్షలు...  

భారత్ పై ఇలా పరోక్ష యుద్ధంతో  సరిపెడతాడా.. లేక ప్రత్యక్ష యుద్దానికి కాలుదువ్వుతాడో అన్నట్లు ఉంది పరిస్థితి!

ఈలోపు మనదేశం మిగతా ప్రపంచ దేశాల మద్దతు సాధించే పనిలో పడింది. ప్రపంచంలో అమెరికాను ఎదిరించే దేశాల గ్రూపును తయారు చేసే పనిలో పడింది. దీనికి రష్యా మద్దతు ఉండనే ఉంటుంది... ఈ సంక్షోభ సమయంలో మనతో నిలిచే దేశాలే మన మిత్రదేశాలు అవుతాయి. 

ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్దంలో విజయం సాధిస్తేనే భారత్ ముందుకు సాగగలదు. దీనికి అనేక దేశాల మద్దతు అవసరం.. జై శంకర్, మోడీలు ఈ సంక్షోభాన్ని దాటగలిగితే అమెరికా వెనక్కితగ్గే అవకాశం ఉంది. 

లేకపోతే ఇది ఒక్క ట్రంప్ తో ఆగదు.. తమ ఆధిపత్యానికి భంగం కలుగుతుంది అని తలిస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా అనేది ఆలోచించాలి. మును ముందు భారత్ ఎన్ని సవాళ్ళను ఎదుర్కో బోతోందో అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.. 

 చివరిగా ఓ మాట .. సంక్షోభాలతో ఆటలు ఆడుకునే చైనా.. ఇండియాను దగ్గర చేయడం అనుమానించాలి.. చైనా మన దేశం నుంచి దిగుమతి చేసుకోదు.. తమ ఎగుమతుల్ని మన దేశం పై కుమ్మరించి తాను లబ్ది పొందాలని చూస్తుంది .. 

 

 Images courtesy: X.com 

18 February 2025

తిరుపతిలో ఘనంగా జరిగిన "తెవికీ పండుగ 2025"

 తెలుగు వికీపీడియా ఆద్వర్యంలో ఈ నెల 14,15,16 తేదీల్లో తెలుగు వికీపీడియా పండుగ 2025 తిరుపతిలో జరిగింది. దేశంలోని వివిధ ప్రాయంత్రాల నుంచి వచ్చిన 50 మందికి పైగా సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. 

తెలుగు లోఇప్పకికే లక్షకు పైగా వ్యాసాలతో ఉన్న  వికీపీడియాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి తెలుగు బాషపై ఆసక్తి ఉన్న ఎవరైనా తమ వంతు సాయంగా వ్యాసాలు రాయవచ్చు. దీనికోసమై తెవికీ బడి పేరుతో శిక్షణ కూడా అందిస్తున్నారు. 

తెలుగు  బ్లాగర్లు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, సామాజిక వాదులు ఎవరైనా సరే తమ తమ రంగాలలో వ్యాసాలను వికీపీడియాలో జతచేయవచ్చు. దీనికోసమై కాస్త శిక్షణ తీసుకుంటే చాలు. 

వివరాలకు వికీ పీడియా చూడండి.. ఇక్కడి నుండి 

ఈ కార్యక్రమ పోటోలు 

 







15 July 2023

'శోధిని' క్రొత్త వర్షన్ ఇప్పుడు అవసరమా?

 బ్లాగులు రాసేవారూ , చూసేవారూ గణనీయంగా తగ్గిపోయారు ... దీనికి చాలా కారణాలున్నా ముఖ్యమైనవి ఏంటంటే - 

1. బిజీ లైఫ్ 

2. తెలుగు ప్రాధాన్యత తగ్గడం. యువకులు రాకపోడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం రాస్తున్నది, చూస్తున్నది పాతతరం వారే.

3. సోషల్ మీడియా 


ఇక ఆగ్గ్రిగేటర్ లు చూసేవారు వేలలోంచి వందలోపుకి పడిపోయారు . అయితే ఇలాంటి పరిస్థితిలో 'శోధిని' క్రొత్త వర్షన్ అవసరమా?  అని మీరు అడగొచ్చు . 

చాలా కాలంనుండి అదే స్క్రిప్ట్ వాడడం , సర్వర్లు  క్రొత్త స్క్రిప్ట్ లతో అప్డేట్ అవ్వడంతో ఒక్కోసారి కొన్ని ఎర్రర్ లు వస్తున్నాయి . అలాగే ఆ స్క్రిప్ట్ నూతన ఫీచర్లకు అనుగుణంగా లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. 

ఇప్పుడు లాభం ఏమిటి? 

మీరు టపా కానీ వ్యాఖ్య కానీ రాసిన క్షణాల్లోనే శోధిని లో ప్రత్యక్షం. 

కొత్త ఫీచర్స్ ఎన్నో తీసుకు రావొచ్చు. 


రాబోయే మార్పులు, చేర్పులు ఏంటి 

  • తెలుగు వార్తా పత్రికల సంకలిని - ఈనాడు, సాక్షి లాంటి ప్రధాన పత్రికలతో 
  • యూట్యూబ్ సంకలిని - తెలుగు చానల్ లతో 

బ్లాగుల విభాగంలో రాబోతున్నచేర్పులు 

  • రచయిత, బ్లాగు ఆధారంగా టపాలు
  • ఎక్కువగా రాసినవారి పేర్ల లిస్టు

ఇంకా ఎన్నో ... 






14 July 2023

సరికొత్త మార్పులతో మీ ముందుకు బ్లాగుల సంకలిని "శోధిని"

 చాలాకాలం తర్వాత మీ అభిమాన శోధిని లో  వీక్షకుల సౌకర్యార్ధం  కొన్ని మార్పులు చేయబడ్డాయి. అవి - 

ఇకపై రెండు వరుసలలో విడి, విడి బ్లాగుల నుంచి టపాలు కాకుండా అన్ని బ్లాగుల టపాలూ రెండువైపులా విస్తరిస్తాయి. దీనివల్ల మొబైల్ లో వీక్షించే వారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. రెండు వరసలలో చూపడం వల్ల ఒక వరుస క్రింద మరో వరుస వచ్చి క్రింది వరకూ రెండో వరుస టపాలకోసం వెళ్ళవలసి వచ్చేది.. ఇకపై ఆ ఇబ్బంది రాదు ..

 

 ఇక వేగం అంటారా ??? మీరే చూడండి ... దూసుకుపోతుంది

 

ఈ మార్పు మీకు నచ్చిందని ఆశిస్తున్నా....

ఇకపోతే...

వ్యాఖ్యల విభాగం కూడా కొన్ని మార్పులతో ముందుకి త్వరలో రాబోతుంది. 


శోధిని కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు

19 July 2010

మన రూపాయికి కొత్త ఫాంట్: డౌన్ లోడ్ చేసుకోండి ఇక్కడ...

రూపాయికి క్రొత్తగా వచ్చిన ఫాంట్ ని మీకంప్యూటర్లో చూసుకోవాలని ఉందా ? మరి ఎందుకు ఆలస్యం ! క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని control panel లోని ఫాంట్స్ ఫోల్డర్ లో paste చేయండి. ఇప్పుడు  ఎక్సెల్ లో గానీ వర్డ్ లో గానీ   కీబోర్డ్ లో "1 " ప్రక్కన ఉండే "`" కీని నొక్కి ఆతర్వాత రూపాయిలను నంబర్స్ లో టైపు చేసి ఫాంట్ గా "Rupee " ని సెలెక్ట్ చేసుకోవాలి. ముద్దుగా ఉందికదూ మన క్రొత్త ఫాంట్ !!! మరి ఎందుకు ఆలస్యం ఉపయోగించడం మొదలు పెడదామా
డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి DOWNLOAD



Related Posts Plugin for WordPress, Blogger...