24 December 2013

ఉచితంగా హోస్టింగ్ అకౌంట్ - అతి సులభంగా..


100జీబీ బ్యాండ్ విడ్త్ తో , 10జీబీ స్పేస్ తో కూడిన హోస్టింగ్ అకౌంట్ కేవలం ఒక్క నిమిషంలో ఉచితంగా పొందాలంటే  క్రింది లింక్ ను క్లిక్ చేయండి చాలు. homehost.us అందిస్తుందీ అవకాశం.అన్నట్లు ఓ డొమైన్ నేం కూడా ఫ్రీ గానే వస్తుంది. నాయొక్క వెబ్ సైట్ ఇదిగో : http://srinivasrjy.homehost.us/

లింక్: http://homehost.us/

18 December 2013

అందరికీ నచ్చే వర్డుప్రెస్సు 3.8 పార్కర్

వర్డుప్రెస్సు  తన క్రొత్త వెర్షన్ 3.8 ను విడుదల చేసింది . దానిని రూపొందించిన చార్లీ పార్కర్ పేరుమీద దానికి పార్కర్ అని నామకరణం చేసింది. ఇక ఎలా ఉందంటారా ... చాలా బాగుందనే చెప్పాలి. వర్డుప్రెస్సు వాడేవారు అందరూ సంతోషించేలా క్రొత్త రూపం అడ్మిన్ పానెల్ లో ఉంది, కొన్ని డజన్ల రంగులు, గ్రేడియంట్ షేడ్స్ తో ముచ్చటగా ఉంది . మీరూ నవీకరించుకోండి.
: వివరాలకు :  http://wordpress.org/news/2013/12/parker/



02 November 2013

మీ బ్లాగును సెర్చ్ ఇంజన్లు గుర్తించేలా చేసుకోండిలా

సెర్చ్ ఇంజన్లు గుర్తించకపోతే ఎన్ని టపాలు వ్రాసినా చదివేవారు ఉండరు కదా... మనను ఏ టాపిక్ పై టపా వ్రాసినా ఎప్పుడో ఇకసారి సెర్చ్ ఇంజన్లద్వారా వెతికి మన టపా చదివేలగ ఉందాలి. లేకపోతే ఆగ్రిగేటర్లలో కనపడే ఆ కొద్ది గంటలు మాత్రమే కొందరు చదివగలరు ఆ తర్వాత ఆ టపా మరుగున పడిపోతుంది. ఎప్పటికీ టపా చదివేలాగ ఉండాలంటే సెర్చ్ ఇంజన్లకు దొరకాలి . అలా చేయాలంటే క్రింది సెట్టింగ్స్ మీ బ్లాగర్ డేష్ బోర్డ్ లో చేయండి.


ముందుగా బ్లాగర్ డేష్బోర్డ్ లో బ్లాగు సెట్టింగ్స్ కు వెళ్ళీ Search Preferences ఆప్షన్ ను ఎంచుకోండి. Description ను ఎనేబుల్ చేసి ఒక మంచి డెస్క్రిప్షన్ మీ బ్లాగుకు ఇవ్వండి.


ఇలా చేయడంవల్ల ఇకపై మీరు టపాలు వ్రాసేటప్పుడు ప్రక్కన Post ఆప్షన్లలో అని వస్తుంది. దానిలో మీ టపా టైటిల్ లేదా ఆ టపా గురించిన సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు.


ఆ తర్వాత ముఖ్యంగా చేయవల్సినది బ్లాగు టెంప్లేట్ హెడర్ లో మార్పులు. ఇవి చెయ్యకపోతే మీరు మార్చినా ప్రయోజనంలేదు.
అదెలా అంటే మీ టెంప్లేట్ ఏడిట్ లో అని ఉంటుంది. దాని పైన క్రింది విధంగా ఉండాలి లేకపోతే ఈ కోడ్ ను పేస్టే చేసి సేవ్ చేయండి.

<b:include data='blog' name='all-head-content'/>
	<title>
		<b:if cond='data:blog.pageType == &quot;index&quot;'>
			<data:blog.pageTitle/>
		<b:else/>
			<b:if cond='data:blog.pageType != &quot;error_page&quot;'>
				<data:blog.pageName/> | <data:blog.title/>
			<b:else/>
				404 | <data:blog.title/> 
			</b:if>
		</b:if>
    </title>
	<b:if cond='data:blog.metaDescription == &quot;&quot;'>
		<meta expr:content='data:blog.pageName + &quot; - &quot; + data:blog.title' name='description'/>
	<b:else/>
		<meta expr:content='data:blog.metaDescription' name='description'/>			
	</b:if>
 ( గమనిక : పై మార్పులు చేసే ముందు మీ టెంప్లేట్ ను బేక్ అప్ తీసుకోవడం మర్చిపోవద్దు. పై కోడ్ మర్పు చేసే ముందు ఇప్పటికే ఇలాంటి కోడ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న డెస్క్రిప్షన్ , కీ వర్డ్ మెటా టేగ్స్ ను తొలగించండి.)
Source: http://bloggeritems.com నుండి సేకరించబడిన సమాచారం ఆధారంగా పరిశోధన చేసిన పిదప వ్రాయబడినది. ...
 
 

21 August 2013

అనేక ఫోల్డర్లలో ఉన్న MP3 ఫైళ్ళను ఒకే ఫోల్డర్ లోకి మార్చడానికి చిన్ని ట్రిక్

మేమరీకార్డ్ లోనికి వివిధ సినిమాల పాటలను ఫోల్దేర్స్ తో సహా Mymusic folderలో సేవ్ చెస్తే కొన్ని ఫోన్లలో ప్లే కావు. వాటిని MP3 ఫైళ్ళ  లాగానే సేవ్ చేయవలసి ఉంటుంది . అలాగే ఒక్కోసారి వివిధ ఫోల్డర్లలోని xl లేదా మరో ఫైల్స్ ను ఒకే ఫోల్డర్ లో చేయవలసి రావచ్చు. దీనికి  ఓ చిన్న ట్రిక్ ...
start  >>> సెర్చ్ ద్వారా మనకు కావాల్సిన ఫోల్డర్ లో mp3 ఫైల్స్ అయితే .mp3 అనీ లేదా .xls అనో లేదా .* అనో టైపు చేసి సెర్చ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయికదా ! వాటిని కాపీ చేసుకొని క్రొత్త ఫోల్డర్ లో పేస్టు చేస్తే చాలు.

మరిన్ని ట్రిక్స్ మరోసారి ...

02 June 2013

చైనా వస్తువులు ఎందుకు వాడకూడదు? కొన్ని కారణాలు

అతి చవుకగా వస్తున్నాయని చైనా వస్తువులు ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కానీ అవి వాడడం ద్వారా మనకు అలాగే మిగతా ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని నేను ఎంతోకాలంగా అందరితో పంచుకోవాలని అనుకుంటూ నా మనసు దోలిచేస్తుంటే ఇప్పుడు చెపుతున్నాను .


1.చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. అక్కడ ప్రతీదీ ప్రభుత్వ సొంతం. అలాగే మనం కొనే వస్తువులపైన లాభం కూడా! ఆ లాభంలొ చాలా భాగాన్ని చైనా తన రక్షణాపాటవాన్ని పెంచుకోడానికి ( ముఖ్యంగా అమెరికా, ఇండియా లను దెబ్బతీసేందుకు ) వినియోగిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రపంచం మొత్తానికి నష్టమే.
2. చైనా ఉపయోగించే టెక్నాలజీ ఒక తక్కువరకముది. మొబైళ్ళలోనూ, ఇతర ఆట వస్తువులలోనూ ఉపయోగించే పరికరాలు, సాఫ్ట్వేర్ రిపేరు చెయ్యడాని కూడా వీలుకాకుండాఉంటుంది. దీని ద్వారా మనం మరలా మరలా డబ్బు ఆ చైనాకే తగలేస్తున్నాం.
3. క్రొత్తగా టెక్నాలజీని అభివ్రుద్దిచెయ్యాలనుకున్న ఔత్సాహికులు తమ ఆలోచనలను విరమించుకోవడమో, లేదా వారి టెక్నాలజీకి మూలాధారంగా మళ్ళీ చైనా పరికరాలనే ఉపయోగించడమో చేస్తున్నారు.దీని ద్వారా టెక్నాలజీ బద్దకం ఏర్పడుతోంది.గత కొన్నేళ్ళుగా ప్రపంచమంతా ఇది కనపడుతోంది. ఉదాహరణ: నా చిన్నప్పుడు జపాన్ రేడియో అంటే చాలా గొప్ప. వాళ్ళు ఏది తయారు చేసినా అతి నాణ్యతతో తయరు చేసేవారు ఇప్పుడు జపాన్ ఎక్కడుంది?
4. అతి ప్రమాదకారి అయిన ప్లాస్టిక్ ను ఎలా నాశనం చెయ్యాలా అని ప్రపంచమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే చైనా అదే ప్లాస్టిక్ ను బొమ్మలు గానో , ఇతర వస్తువులుగానో మర్చి ప్రపంచం పైకి వదిలి మరీ సొమ్ము చేసుకుంటుంది .
5. మిగతా దేశాల లాగ చైనాలో ఏదైనా కనిపెట్టిన తర్వాత దాని లోపాలనూ పర్యవసానాలనూ పరీక్షిస్తూ టైం వేస్ట్ చెసుకొరు. సాద్యమైనంత తొందరగా ప్రపంచం మీదికి వదిలేస్తారు . అందుకే వారు తయారు  చేసిన ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియేషన్ ను అవసరానికి మించి ఉత్పత్తి  చేస్తుంటాయి .
ఆలోచించే కొలదీ ఇంకా అనేక కారణాలు బయట పడుతాయి . కనుక ప్రభుత్వం సంగతి తర్వాత ముందు మనం చైనా వస్తువులను వాడకుండా ఉండడమే బెట్టర్ . మనకీ మన పిల్లలకీ కూడా .... ఆలోచించండి !!!
Related Posts Plugin for WordPress, Blogger...