20 October 2025

దీపావళి శుభాకాంక్షలు


 

02 October 2025

విజయదశమి శుభాకాంక్షలు

 




05 September 2025

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

 


30 August 2025

భారత్ జిడిపి 7.8%: మన అభివృద్దే మనకి ముప్పు తెస్తోందా?!

 

 "డెడ్ ఎకానమీ" గా ట్రంప్ వర్ణించిన భారత్ ప్రస్తుత జిడిపి వృద్ది రేటు 7.8% అని రాత్రి చదవగానే నా మనసులో  కొన్ని అనుమానాలు వచ్చాయి... 

వార్తల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్! 

https://andamanpartners.com/wp-content/uploads/2025/08/Indias-Phenomenal-Growth-Trajectory-ANDAMAN-PARTNERS-2025-800x533.png 

అమెరికా జిడిపి వృద్దిరేటు కేవలం 2.1% మాత్రమే ...

 

 మరోవైపు అన్ని రంగాల్లో రికార్డులు సృష్టిస్తోన్న భారత్ 

 

అదీ కాక నిన్న కాక మొన్న పాకిస్తాన్ తో పాటూ యుద్దంలో భంగపాటుకు గురైన అమెరికా.. యుద్దాన్ని తానే అపానని  చెప్పుకుని ఫూల్ అయిన ట్రంప్ 

 

వీటన్నింటినీ మనసులో పెట్టుకుని రష్యా నుంచి ఆయిల్ కొంటుందన్న సాకుతో భారత్ పై టారిఫ్ అనే యుద్దాన్ని ప్రకటించాడు 

https://static.toiimg.com/thumb/msid-123539032,imgsize-1180826,width-400,resizemode-4/123539032.jpg 

నిజానికి భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్స్ కొంటున్న చైనా, తమ మిత్ర దేశాలపై విధించనంత టారిఫ్ 50% విధించాడు. 

ఇదే విధంగా అభివృద్ధి చెందితే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశం కావచ్చు అని అమెరికా ఆర్ధికవేత్తలు హెచ్చరించి ఉండొచ్చు. అందుకే ఇండియాను కట్టడి చేసే మార్గాలను వెతుక్కున్తున్నది అమెరికా.

ఒకవైపు మన దేశాన్ని అస్థిర పరిచందుకు పాకిస్తాన్ తో దోస్తీ.. మరోవైపు వాణిజ్య ఆంక్షలు...  

భారత్ పై ఇలా పరోక్ష యుద్ధంతో  సరిపెడతాడా.. లేక ప్రత్యక్ష యుద్దానికి కాలుదువ్వుతాడో అన్నట్లు ఉంది పరిస్థితి!

ఈలోపు మనదేశం మిగతా ప్రపంచ దేశాల మద్దతు సాధించే పనిలో పడింది. ప్రపంచంలో అమెరికాను ఎదిరించే దేశాల గ్రూపును తయారు చేసే పనిలో పడింది. దీనికి రష్యా మద్దతు ఉండనే ఉంటుంది... ఈ సంక్షోభ సమయంలో మనతో నిలిచే దేశాలే మన మిత్రదేశాలు అవుతాయి. 

ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్దంలో విజయం సాధిస్తేనే భారత్ ముందుకు సాగగలదు. దీనికి అనేక దేశాల మద్దతు అవసరం.. జై శంకర్, మోడీలు ఈ సంక్షోభాన్ని దాటగలిగితే అమెరికా వెనక్కితగ్గే అవకాశం ఉంది. 

లేకపోతే ఇది ఒక్క ట్రంప్ తో ఆగదు.. తమ ఆధిపత్యానికి భంగం కలుగుతుంది అని తలిస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా అనేది ఆలోచించాలి. మును ముందు భారత్ ఎన్ని సవాళ్ళను ఎదుర్కో బోతోందో అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.. 

 చివరిగా ఓ మాట .. సంక్షోభాలతో ఆటలు ఆడుకునే చైనా.. ఇండియాను దగ్గర చేయడం అనుమానించాలి.. చైనా మన దేశం నుంచి దిగుమతి చేసుకోదు.. తమ ఎగుమతుల్ని మన దేశం పై కుమ్మరించి తాను లబ్ది పొందాలని చూస్తుంది .. 

 

 Images courtesy: X.com 

22 June 2025

"శోధిని" లో ఇటీవలి మార్పులు ...

 1. అనామక కామెంట్లు హోమ్ పేజీ నుండి కనపడవు . 

వాటిని విడిగా ఇక్కడి నుంచి  

లేదా ఇటీవలి ప్రముఖ వ్యాఖ్యాతలు లో    చూడవచ్చు 

 2.లింకులతో కూడిన కామెంట్లు శోధిని లో కనపడవు 

 శోధినిలోఇతర మార్పులు

పోస్టు లో పెట్టిన బొమ్మ ఒకటి కనపడుతుంది (తెలుగు హోమ్ పేజీ లోతప్ప మిగతా అన్ని విభాగాల్లో)                  

 

       

18 February 2025

తిరుపతిలో ఘనంగా జరిగిన "తెవికీ పండుగ 2025"

 తెలుగు వికీపీడియా ఆద్వర్యంలో ఈ నెల 14,15,16 తేదీల్లో తెలుగు వికీపీడియా పండుగ 2025 తిరుపతిలో జరిగింది. దేశంలోని వివిధ ప్రాయంత్రాల నుంచి వచ్చిన 50 మందికి పైగా సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. 

తెలుగు లోఇప్పకికే లక్షకు పైగా వ్యాసాలతో ఉన్న  వికీపీడియాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి తెలుగు బాషపై ఆసక్తి ఉన్న ఎవరైనా తమ వంతు సాయంగా వ్యాసాలు రాయవచ్చు. దీనికోసమై తెవికీ బడి పేరుతో శిక్షణ కూడా అందిస్తున్నారు. 

తెలుగు  బ్లాగర్లు, ఉపాద్యాయులు, విద్యార్ధులు, సామాజిక వాదులు ఎవరైనా సరే తమ తమ రంగాలలో వ్యాసాలను వికీపీడియాలో జతచేయవచ్చు. దీనికోసమై కాస్త శిక్షణ తీసుకుంటే చాలు. 

వివరాలకు వికీ పీడియా చూడండి.. ఇక్కడి నుండి 

ఈ కార్యక్రమ పోటోలు 

 







01 January 2025

🎉Happy New Year 2025 🎉

🎉🎊 Happy New Year 2025 to Telugu Blog Viewers and Writers 🎉🎊

 


Related Posts Plugin for WordPress, Blogger...