"డెడ్ ఎకానమీ" గా ట్రంప్ వర్ణించిన భారత్ ప్రస్తుత జిడిపి వృద్ది రేటు 7.8% అని రాత్రి చదవగానే నా మనసులో కొన్ని అనుమానాలు వచ్చాయి...
వార్తల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్!
అమెరికా జిడిపి వృద్దిరేటు కేవలం 2.1% మాత్రమే ...
మరోవైపు అన్ని రంగాల్లో రికార్డులు సృష్టిస్తోన్న భారత్
అదీ కాక నిన్న కాక మొన్న పాకిస్తాన్ తో పాటూ యుద్దంలో భంగపాటుకు గురైన అమెరికా.. యుద్దాన్ని తానే అపానని చెప్పుకుని ఫూల్ అయిన ట్రంప్
వీటన్నింటినీ మనసులో పెట్టుకుని రష్యా నుంచి ఆయిల్ కొంటుందన్న సాకుతో భారత్ పై టారిఫ్ అనే యుద్దాన్ని ప్రకటించాడు
నిజానికి భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్స్ కొంటున్న చైనా, తమ మిత్ర దేశాలపై విధించనంత టారిఫ్ 50% విధించాడు.
ఇదే విధంగా అభివృద్ధి చెందితే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశం కావచ్చు అని అమెరికా ఆర్ధికవేత్తలు హెచ్చరించి ఉండొచ్చు. అందుకే ఇండియాను కట్టడి చేసే మార్గాలను వెతుక్కున్తున్నది అమెరికా.
ఒకవైపు మన దేశాన్ని అస్థిర పరిచందుకు పాకిస్తాన్ తో దోస్తీ.. మరోవైపు వాణిజ్య ఆంక్షలు...
భారత్ పై ఇలా పరోక్ష యుద్ధంతో సరిపెడతాడా.. లేక ప్రత్యక్ష యుద్దానికి కాలుదువ్వుతాడో అన్నట్లు ఉంది పరిస్థితి!
ఈలోపు మనదేశం మిగతా ప్రపంచ దేశాల మద్దతు సాధించే పనిలో పడింది. ప్రపంచంలో అమెరికాను ఎదిరించే దేశాల గ్రూపును తయారు చేసే పనిలో పడింది. దీనికి రష్యా మద్దతు ఉండనే ఉంటుంది... ఈ సంక్షోభ సమయంలో మనతో నిలిచే దేశాలే మన మిత్రదేశాలు అవుతాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్దంలో విజయం సాధిస్తేనే భారత్ ముందుకు సాగగలదు. దీనికి అనేక దేశాల మద్దతు అవసరం.. జై శంకర్, మోడీలు ఈ సంక్షోభాన్ని దాటగలిగితే అమెరికా వెనక్కితగ్గే అవకాశం ఉంది.
లేకపోతే ఇది ఒక్క ట్రంప్ తో ఆగదు.. తమ ఆధిపత్యానికి భంగం కలుగుతుంది అని తలిస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా అనేది ఆలోచించాలి. మును ముందు భారత్ ఎన్ని సవాళ్ళను ఎదుర్కో బోతోందో అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..
చివరిగా ఓ మాట .. సంక్షోభాలతో ఆటలు ఆడుకునే చైనా.. ఇండియాను దగ్గర చేయడం అనుమానించాలి.. చైనా మన దేశం నుంచి దిగుమతి చేసుకోదు.. తమ ఎగుమతుల్ని మన దేశం పై కుమ్మరించి తాను లబ్ది పొందాలని చూస్తుంది ..
Donald Trump: Indian economy is dead
— Pakchikpak Raja Babu (@HaramiParindey) August 29, 2025
India with 7.8% Q1 GDP growth: pic.twitter.com/lkCe4YIfnV
Images courtesy: X.com
No comments:
Post a Comment