ఈమధ్య షిర్డీ సాయిబాబాపై కొందరు హిందూ సనాతనవాదులు అని చెప్పుకునేవారు విపరీతంగా దాడి చేస్తున్నారు. సాయిబాబా హిందువు కాదు .. ముస్లిం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
దేవుడు ఒక్కడే (sabkaa Maalik Ek Hai) అన్న సాయిబాబాకు మతం రంగు పులిమి భక్తుల మనోభావాలను డెబ్బ తీస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది అని అర్ధం అవుతుంది.
దేశంలో హిందూ మతోన్మాదవాదులు "సనాతన ధర్మం" పేరుతొ పెరిగిపోతున్నారు.
ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు వచ్చిన హిందూ ధర్మం యుగయుగాలుగా చెక్కు చెదరలేదు. దీనిపై విదేశీయులు కూడా మక్కువ పెంచుకునేవారు. అలాటింది ఈ హిందూ ఉగ్ర తాండవవాదుల ప్రవర్తనతో హిందూ ధర్మం విదేశాల్లో కూడా చులకన ఐపోయే రోజులు వస్తున్నాయి.
హిందువులపై దాడులు జరిగితే ప్రతిదాడి.. పరమత విద్వేషాలు... పెచ్చరిల్లుతున్నాయి.
పరమత సహనం నేర్పిన మనకు మతోన్మాదం అలవాటు చేస్తున్నాయి.
దీనిలో భాగమే షిర్డీసాయి పై ఈ అవాకులూ . చెవాకులూ.. దీనికి మీడియా కూడా సహకరిస్తూ రోజంతా చర్చలు పెడుతోంది.
ఇలాగే జరిగితే షిర్డీసాయి భక్తులపై దాడులు జరిగే అవకాశం ఉంది.
1 comment:
ఈమధ్య కాలంలో అనేక ఆలయాలలో షిర్దీ సాయిబాబా గారి ఉపాలయాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఉపాలయాలు ఏర్పరచటం ఆక్షేపణీయం కాదు. కాని ఆ ఉపాలయాల తీరు తరచుగా ఆక్షేపణీయంగా ఉంటోంది.
అటువంటి ఉపాలయాలలో పెద్దగా అమర్చిన సాయిబాబా విగ్రహం పాదాలవద్ద శివ రామ కృష్ణాది దేవతా మూర్తుల చిన్నచిన్న విగ్రహాలను ఉంచుతున్నారు. ఇది ఏమిటి అని అడిగితే ఈదేవీదేవతలు అందరూ సాయిబాబా గారి అవతారాలే కదా అని సమాధానం చెబుతున్నారు. తప్పు కదా!
దేశంలో హిందూ మతోన్మాదవాదులు "సనాతన ధర్మం" పేరుతొ పెరిగిపోతున్నారని మీరు ఆక్షేపిస్తున్నారు. ననాతనధర్మం అన్న సంబోధనయే సరైనది హిందూ అనే సంబోధన పొరపాటు. సనాతనం అన్నమాటకు ఎల్లపుడూ ఉండేదని అర్ధం.
ఇప్పటికే మనలో సగుణోపాసనలో ఉన్న పెసులుబాటు కారణంగా అనేకరూపాలలో దేవతార్చన ఉన్నది. కాలడి శంకరులు ఏర్పరచిన సామరస్యం కారణంగా విబేధాలూ స్వల్పతరం.
ఇపుడు మనం మహిమాన్వితులు అనిపించిన వారిని మరికొందరిని పూజించటం మొదలుపెట్టటం కోసం ఉన్న ఆలయాలలో ఉపాలయాలు ఈవిధంగా ఏర్పరచటం అవసరమా? రామశివాది దేవతామూర్తులను కొత్తదేవుళ్ళపాదాలపై వేయటం ఉచితమా?
ఈకొత్త ఆలోచనలు వింతలు ఉచితమా? వ్యాసపూర్ణిమ నాడు వ్యాసుని గౌరవించిపూజించక సాయిబాబా గుడికి పోయి పూజాదర్శనాలు ఏమి ఉచితం? మతమౌఢ్యం ఈకొత్తపోకడలలో కనిపించటంలేదా?
సాయిబాబా గారిపై దుష్ప్రచారం అవసరం కాదు. పొరపాటు. ఆయన ఒక సద్గురువు. అంతవరకే. గుడులుకట్టి ఆయనే మాత్రమే దేవుడు అని సంప్రదాయిక దేవతామూర్తులను నిరాకరణ చేయటం అవివేకం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఋషులకు మనం గుడులు కట్టటం లేదే! మహాయోగులు నిత్యం లోకసంగ్రహార్ధం వస్తూ ఉంటారు. వారి బోధలు వినండి పాటించండి కాని సదరు యోగుల పేర కొత్తమతాలూ కొత్త గందరగోళాలూ అసంగతం.
సనాతనధర్మం ఇతరధర్మాలను ఆదరించే స్వభావం కలదికాబట్టి కొత్తగా మనలోనే ఈ ఉపమతాలు తలెత్తుతున్నాయి. వర్ధిల్లుతున్నాయి. సనాతనధర్మంపై మతోన్నాదం ఆక్షేపణ పొరపాటు.
Post a Comment