ఈమధ్య షిర్డీ సాయిబాబాపై కొందరు హిందూ సనాతనవాదులు అని చెప్పుకునేవారు విపరీతంగా దాడి చేస్తున్నారు. సాయిబాబా హిందువు కాదు .. ముస్లిం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
దేవుడు ఒక్కడే (sabkaa Maalik Ek Hai) అన్న సాయిబాబాకు మతం రంగు పులిమి భక్తుల మనోభావాలను డెబ్బ తీస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది అని అర్ధం అవుతుంది.
దేశంలో హిందూ మతోన్మాదవాదులు "సనాతన ధర్మం" పేరుతొ పెరిగిపోతున్నారు.
ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు వచ్చిన హిందూ ధర్మం యుగయుగాలుగా చెక్కు చెదరలేదు. దీనిపై విదేశీయులు కూడా మక్కువ పెంచుకునేవారు. అలాటింది ఈ హిందూ ఉగ్ర తాండవవాదుల ప్రవర్తనతో హిందూ ధర్మం విదేశాల్లో కూడా చులకన ఐపోయే రోజులు వస్తున్నాయి.
హిందువులపై దాడులు జరిగితే ప్రతిదాడి.. పరమత విద్వేషాలు... పెచ్చరిల్లుతున్నాయి.
పరమత సహనం నేర్పిన మనకు మతోన్మాదం అలవాటు చేస్తున్నాయి.
దీనిలో భాగమే షిర్డీసాయి పై ఈ అవాకులూ . చెవాకులూ.. దీనికి మీడియా కూడా సహకరిస్తూ రోజంతా చర్చలు పెడుతోంది.
ఇలాగే జరిగితే షిర్డీసాయి భక్తులపై దాడులు జరిగే అవకాశం ఉంది.
3 comments:
ఈమధ్య కాలంలో అనేక ఆలయాలలో షిర్దీ సాయిబాబా గారి ఉపాలయాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఉపాలయాలు ఏర్పరచటం ఆక్షేపణీయం కాదు. కాని ఆ ఉపాలయాల తీరు తరచుగా ఆక్షేపణీయంగా ఉంటోంది.
అటువంటి ఉపాలయాలలో పెద్దగా అమర్చిన సాయిబాబా విగ్రహం పాదాలవద్ద శివ రామ కృష్ణాది దేవతా మూర్తుల చిన్నచిన్న విగ్రహాలను ఉంచుతున్నారు. ఇది ఏమిటి అని అడిగితే ఈదేవీదేవతలు అందరూ సాయిబాబా గారి అవతారాలే కదా అని సమాధానం చెబుతున్నారు. తప్పు కదా!
దేశంలో హిందూ మతోన్మాదవాదులు "సనాతన ధర్మం" పేరుతొ పెరిగిపోతున్నారని మీరు ఆక్షేపిస్తున్నారు. ననాతనధర్మం అన్న సంబోధనయే సరైనది హిందూ అనే సంబోధన పొరపాటు. సనాతనం అన్నమాటకు ఎల్లపుడూ ఉండేదని అర్ధం.
ఇప్పటికే మనలో సగుణోపాసనలో ఉన్న పెసులుబాటు కారణంగా అనేకరూపాలలో దేవతార్చన ఉన్నది. కాలడి శంకరులు ఏర్పరచిన సామరస్యం కారణంగా విబేధాలూ స్వల్పతరం.
ఇపుడు మనం మహిమాన్వితులు అనిపించిన వారిని మరికొందరిని పూజించటం మొదలుపెట్టటం కోసం ఉన్న ఆలయాలలో ఉపాలయాలు ఈవిధంగా ఏర్పరచటం అవసరమా? రామశివాది దేవతామూర్తులను కొత్తదేవుళ్ళపాదాలపై వేయటం ఉచితమా?
ఈకొత్త ఆలోచనలు వింతలు ఉచితమా? వ్యాసపూర్ణిమ నాడు వ్యాసుని గౌరవించిపూజించక సాయిబాబా గుడికి పోయి పూజాదర్శనాలు ఏమి ఉచితం? మతమౌఢ్యం ఈకొత్తపోకడలలో కనిపించటంలేదా?
సాయిబాబా గారిపై దుష్ప్రచారం అవసరం కాదు. పొరపాటు. ఆయన ఒక సద్గురువు. అంతవరకే. గుడులుకట్టి ఆయనే మాత్రమే దేవుడు అని సంప్రదాయిక దేవతామూర్తులను నిరాకరణ చేయటం అవివేకం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఋషులకు మనం గుడులు కట్టటం లేదే! మహాయోగులు నిత్యం లోకసంగ్రహార్ధం వస్తూ ఉంటారు. వారి బోధలు వినండి పాటించండి కాని సదరు యోగుల పేర కొత్తమతాలూ కొత్త గందరగోళాలూ అసంగతం.
సనాతనధర్మం ఇతరధర్మాలను ఆదరించే స్వభావం కలదికాబట్టి కొత్తగా మనలోనే ఈ ఉపమతాలు తలెత్తుతున్నాయి. వర్ధిల్లుతున్నాయి. సనాతనధర్మంపై మతోన్నాదం ఆక్షేపణ పొరపాటు.
@శ్యామలీయం
ఇక్కడ నా అభ్యంతరం ఆలయాలలో ఉపాలయాలు ఏర్పాటు అంగీకారం/తిరస్కరణ మీద కాదు.. కోట్లాది భక్తులు సాక్షాత్తూ దేవంగా కొలిచే షిర్దీ సాయిబాబా వారిని కించపరచడం కోసం.
సనాతన ధర్మం ప్రతీ హిందూ పాటించాలి అనే విషయంలో కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇక్కడ సనాతన ధర్మం నుండి హిందూ మతోన్మాదవాదులను వేరుచేసి మాత్రమె రాసాను. "సనాతన ధర్మం" కోసం తెలియని వారుకూడా ఆ పేరు వాడుకుంటున్నారు. ఇది కూడా మతమౌఢ్యమే!
'హిందూ ధర్మం' లో యుగానికి తగ్గట్టు, కాలానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు క్రొత్త మార్పులు సంతరించుకోవడం అవసరమే, లేకపొతే ధర్మం పది కాలాల పాటు.. కొన్ని యుగాలపాటు నిలబడదు.
షిర్డీ సాయిబాబా వారిని ఎలా పూజించాలో వారు చెప్పలేదు.. ఎవరికీ తోచినట్లు, ఎవరికీ వీలుగా వారు పూజిస్తున్నారు అంటే అది ఆనందపడాల్సిన విషయమే. నిజం చెప్పాలి అంటే మనకు ఉన్న ముక్కోటి దేవతలూ కారణ జన్ములే. వారిలో ఏ ఒక్కరినీ దైవం కాదు అంటే సమంజసమా...
సంప్రదాయిక దేవతామూర్తులు అన్నారు.. అది ఎలాగ? దేవతా మూర్తులలో కూడా సాంప్రదాయ మూర్తులు ఉన్నారా?
ఒకవైపు శివాలయంలో కూడా వైష్ణవ ఉపాలయాలు ఉంటున్నాయి. వైష్ణవ ఆలయాల్లోనూ శైవ ఉపాలయాలు ఉంటున్నాయి. అభ్యంతరం ఎందుకు?
సనాతనం పాటిస్తే తప్పులేదు. దాన్ని అందరిమీదా రుద్దాలని అనుకుంటే అదే మతోన్నాదం.
ఏ మహితాత్ముని ధామమ్ము శాంతికి
చిరునామగా విలసిల్లు చుండు ?
ఏ మందిరము మహనీయమై తర తమ
భేదాలు లేక శోభిల్లు చుండు ?
ఏ మూర్తిని స్పృశించి యిరవొంద నానంద
పారవశ్యము వీలు పడుచు నుండు ?
ఎచ్చోట దూరాలు , హెచ్చుబాటులు తగ్గి
అందరొక్కటి గాగ నలరు చుంద్రు ?
ఏ యనఘు దర్శనముచేత హాయి గలుగు ?
కోర్కెలీరేడు , కష్టాలు గూలి పడును
ఆతడే సాయి - జనులలో నమ్మక మిది
నమ్మకమె దైవమయి నిల్చు , వమ్ము గాదు .
శ్రధ్ధా , సబూరిలు చక్కగా పాటించ
హితబోధ చేసిన హితు డితండు
రెండు రూపాయల దండి దక్షిణ గొని
కష్టాలు బాపిన ఇష్ట సఖుడు
రోగార్తులను తాకి రుజ బాధలను బాపి
తాననుభవించిన త్యాగ శీలి
' సాయి ! కాపాడ రారా ' యన్న తక్షణ
మాదుకొను కరుణామయు డితండు
సర్వ దేవతా సత్తాక సద్గురుండు
సాయి నాధుండు – తమ మనసార కోరి
చరణములు తాకి తరియింత్రు సకల జనులు
శరణు శరణంచు వేడి ప్రశాంతి బొంద .
చాలిక వద్దండి చాలయెక్కువయింది
గురుస్థాన స్థితులకు కూడని పని
కోటాను కోట్ల భక్తుల మనోభావాల
హననకు దిగకండి ఆర్తి రగులు
అసలిదేమి ఘనత ? పస గలదేని _ ప్ర
జా సమస్యలు లేవ ? చక్క దిద్ద
చదువు చెప్పించండి సంస్థలు నెలకొల్పి
వైద్య మందించండి ఉద్యమించి
పేద వాళ్ళకీరెండె లాభించుగాని
" సాయి " _ దేవుడా ? కాదన్న చర్చ కాదు
అసలిదేమి రగడ ? ఆపరా ? యికైన
భరత సంస్కృతి కాదిది పరము లార !
పాద పూజకుగాని , ప్రవచనాలకుగాని
కానుక లడిగెనా కాంక్షదీర ?
రజిత సింహాసన రాజ భోగాలలో
మనసార తేలెనా తనివి దీర ?
తలకు గెడ్డాలకు తలలోని తలపుకు
నల్ల రంగలదెనా యుల్లమలర ?
ఏసీ గదులు కార్లు వాస యానాలకు
తనివార వాడెనా మనసుదీర ?
తిరిగి నాలుగిళ్ళు తెచ్చి భిక్షాన్నంబు
అనుచరులకుబెట్టి యపుడు తినెను
చిరుగుబొంత కట్టి సిరులిచ్చె జనులకు
సాయితోడ మీకు సామ్య మేల ?
Post a Comment