02 June 2013

చైనా వస్తువులు ఎందుకు వాడకూడదు? కొన్ని కారణాలు

అతి చవుకగా వస్తున్నాయని చైనా వస్తువులు ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కానీ అవి వాడడం ద్వారా మనకు అలాగే మిగతా ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని నేను ఎంతోకాలంగా అందరితో పంచుకోవాలని అనుకుంటూ నా మనసు దోలిచేస్తుంటే ఇప్పుడు చెపుతున్నాను .


1.చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. అక్కడ ప్రతీదీ ప్రభుత్వ సొంతం. అలాగే మనం కొనే వస్తువులపైన లాభం కూడా! ఆ లాభంలొ చాలా భాగాన్ని చైనా తన రక్షణాపాటవాన్ని పెంచుకోడానికి ( ముఖ్యంగా అమెరికా, ఇండియా లను దెబ్బతీసేందుకు ) వినియోగిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రపంచం మొత్తానికి నష్టమే.
2. చైనా ఉపయోగించే టెక్నాలజీ ఒక తక్కువరకముది. మొబైళ్ళలోనూ, ఇతర ఆట వస్తువులలోనూ ఉపయోగించే పరికరాలు, సాఫ్ట్వేర్ రిపేరు చెయ్యడాని కూడా వీలుకాకుండాఉంటుంది. దీని ద్వారా మనం మరలా మరలా డబ్బు ఆ చైనాకే తగలేస్తున్నాం.
3. క్రొత్తగా టెక్నాలజీని అభివ్రుద్దిచెయ్యాలనుకున్న ఔత్సాహికులు తమ ఆలోచనలను విరమించుకోవడమో, లేదా వారి టెక్నాలజీకి మూలాధారంగా మళ్ళీ చైనా పరికరాలనే ఉపయోగించడమో చేస్తున్నారు.దీని ద్వారా టెక్నాలజీ బద్దకం ఏర్పడుతోంది.గత కొన్నేళ్ళుగా ప్రపంచమంతా ఇది కనపడుతోంది. ఉదాహరణ: నా చిన్నప్పుడు జపాన్ రేడియో అంటే చాలా గొప్ప. వాళ్ళు ఏది తయారు చేసినా అతి నాణ్యతతో తయరు చేసేవారు ఇప్పుడు జపాన్ ఎక్కడుంది?
4. అతి ప్రమాదకారి అయిన ప్లాస్టిక్ ను ఎలా నాశనం చెయ్యాలా అని ప్రపంచమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే చైనా అదే ప్లాస్టిక్ ను బొమ్మలు గానో , ఇతర వస్తువులుగానో మర్చి ప్రపంచం పైకి వదిలి మరీ సొమ్ము చేసుకుంటుంది .
5. మిగతా దేశాల లాగ చైనాలో ఏదైనా కనిపెట్టిన తర్వాత దాని లోపాలనూ పర్యవసానాలనూ పరీక్షిస్తూ టైం వేస్ట్ చెసుకొరు. సాద్యమైనంత తొందరగా ప్రపంచం మీదికి వదిలేస్తారు . అందుకే వారు తయారు  చేసిన ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియేషన్ ను అవసరానికి మించి ఉత్పత్తి  చేస్తుంటాయి .
ఆలోచించే కొలదీ ఇంకా అనేక కారణాలు బయట పడుతాయి . కనుక ప్రభుత్వం సంగతి తర్వాత ముందు మనం చైనా వస్తువులను వాడకుండా ఉండడమే బెట్టర్ . మనకీ మన పిల్లలకీ కూడా .... ఆలోచించండి !!!

31 December 2012

బ్లాగర్లకు ఉపయోగపడే లింక్

ముందుగా తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
                 WISH YOU HAPPY NEW YEAR 2013



18 May 2012

అసలు మొబైల్ లో ప్రత్యేకంగా వెబ్సైట్ ఎందుకు?

ప్రతీ వెబ్సైట్ లో ఉండే పేజీల్లో అనేకమైన డేటా ఫైల్స్, ఇమేజెస్, జావా, CSS ఫైళ్ళు ఉంటాయి.ఒక వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసినపుడు ఇవన్నీ లోడ్ అవుతుంటాయి. ఈ ఫైళ్ళ వల్లే ప్రతీ వెబ్సైట్ ఆకర్షణీయంగా కనపడుతుంది.సాధారణ కంప్యూటర్లపై ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసినపుడు ఎంత డేటా ఉపయోగించుకున్నా పరవాలేదు. కానీ KBకి ఇంత అని చార్జ్ చేసే మొబైల్ నెట్వర్క్ లలో ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం మనం బ్లాగుల గురించి మాట్లాడు కుంటున్నాం కనుక మన తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్ ల పేజిల సైజ్ చూద్దాం.
జల్లెడ  - 200.6KB
కూడలి - 266.3 KB
బ్లాగిల్లు - 241.2KB
మాలిక- 277.1KB

హారం - 875.4KB
సంకలిని - 2.5MB( APPROX 2600KB)
బ్లాగిల్లు మొబైల్  - 3.4KB
ఎక్కువ పేజ్ సైజ్ వల్ల ఖర్చు మాత్రమే కాక ఆయా వెబ్సైట్లు లోడ్ అయ్యే సమయం కూడా పెరుగు తుంది.
తెలుగు బ్లాగర్ల సౌకర్యాల కోసం అనేక ప్రయోగాలు చేస్తున్న మీ "బ్లాగిల్లు" ఇప్పుడు మొబైల్ వెబ్ సైట్ గా వచ్చింది. దీని పేజ్ సైజ్ కేవలం దీనివల్ల మొబైల్ యూజర్లు అతితక్కువ ఖర్చుతోనే ఈ వెబ్సైట్ ను వీక్షించవచ్చు. తెలుగు బ్లాగర్లకు ఇది శుభవార్తే కదా..!!

15 May 2012

Related Posts Plugin for WordPress, Blogger...