01 May 2015

సంవత్సరం పాటు ఉచితంగా .net డొమైన్ మరియు హోస్టింగ్ పొందండి - త్వరపడండి

గూగుల్ , హోస్ట్ గేటర్ లతో కలిసి ఇండియా గెట్ ఆన్లైన్    సంయుక్తంగా అందిస్తున్న అద్భుత ఆఫర్ ఇది . ఇండియాలోని వ్యాపారులకు , వాటిలోని వ్యక్తులకు అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా మీరూ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు .
ఒక .net  డొమైన్ సంవత్సరంపాటు ఉచితంగా లభిస్తుంది ఈ ఆఫర్ లో
మరెందుకు ఆలస్యం . ఇక్కడ క్లిక్ చేసి వివరాలు చూడండి .

15 March 2015

గూగుల్ కోడ్ హోస్టింగ్ ప్రోజెక్ట్ మూతపడబోతోంది

గూగుల్ రెండురోజుల క్రితం తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది మొదటికి కోడ్ హోస్టింగ్ ప్రోజెక్ట్ మూతపడబోతోంది. క్రొత్తగా ప్రోజెక్ట్ లను అనుమతించడం ఇప్పటికే ఆపివేసిన్ గూగుల్ ఇప్పటికే ఉన్న కోడ్ ప్రోజెక్ట్ లకు  ఆధునీకరణలనూ నిలిపివేసింది. ప్రస్తుతం అనేక బ్లాగులు, వెబ్ సైట్ లు తమ కోడ్ హోస్టింగ్ కు దీనిపై ఆధార పడ్డాయి. వాటిపై ఈ నిర్ణయం వల్ల ప్రభావం పడుతుంది . కనుక మీ బ్లాగు కోడ్ ఏదైనా దీనిలో ఉంటే మార్పు చేసుకోండి

19 December 2014

మీ విండోస్ 7 లో స్నిపింగ్ టూల్ ( Snipping Tool ) మిస్సయిందా ?

విండోస్ 7 కి ఉన్న మంచి ఫీచర్స్ లో స్నిపింగ్ టూల్ ఒకటి . ఇది స్క్రీన్ లోని ఏదైనా భాగాన్ని కట్ చేసి ఇమేజ్ గా
దాసుకోడానికి ఉపయోగపడుతుంది . ఇది సాధారణంగా స్టార్ట్ మెనూ లొనే ఉండాలి . కొన్ని కంప్యూటర్లలో ఈ టూల్ స్టార్ట్ మెనూ లో కనిపించదు అది ఎక్కడ ఉంటుందో తెలీక చాలామంది తికమక పడుతుంటారు . అలా మిస్సయిన ఆ టూల్ ని తిరిగి స్టార్ట్ మెనూ లోకి తీసుకురావాలంటే అది ఎక్కడ ఉంటుందో వెతికిపట్టుకోవాలి .
ఇంతకీ ఆ టూల్ మన విండోస్ లో ఎక్కడ ఉంటుందో తెలుసా ?
 C:\Windows\System32\SnippingTool.exe

అక్కడ కనిపించిన టూల్ ని స్టార్ట్ మెనూ లోకి జార్చేస్తే సరిపోతుంది .

08 September 2014

శ్యాంసంగ్ చాంప్ పాస్ వర్డ్ మర్చిపొయారా ? చేయండిలా ...

శ్యాంసంగ్ యొక్క చాంప్ లో అనేక మోడల్స్ ఉన్నాయి. ఇవి జావా ఆధారిత టచ్ ఫోన్లు . వీటిలో 265* , 365* లాంటి ఎక్కువగా అమ్ముడైన మోడల్స్ ఉన్నాయి .
ఒకవేళ మీరు ఈ ఫోన్ రీసెట్ చేయాలని అనుకుంటే పాస్ వర్డ్ తెలియాలి . డీఫాల్ట్ గా 12345 అనే పాస్ వర్డ్ ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు పాస్ వర్డ్ మార్చినా అది మర్చిపోయి ఉంటే సర్వీస్ సెంటర్ లో ఇవ్వాలి దీనికి వాళ్ళు దాదాపు 200 రూపాయలు వసూలు చేస్తారు. ఆ అవసరం లేకుండా  క్రింది కోడ్ ఉపయోగించి ఆ పాస్ వర్డ్ ను రీసెట్ చెయ్యవచ్చు .
                                   ఆ కోడ్ :                        *2767*3855#
అని టైప్ చేయండి . మీ ఫోన్ ఆటోమేటిక్ గా రీసెట్ చేయబడుతుంది . ఆ తర్వాత మీకు నచ్చిన పాస్ వార్డ్ మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు ఈ రకం ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే పైన కోడ్ మీ డైరీలో నాట్ చేసుకుని ఉంచుకోండి ఎప్పటికైనా అవసరం పడొచ్చు .
మీ ఫోన్ ఆన్ మామూలుగానే అవుతూ ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతున్నా పై కోడ్ ద్వారా రీసెట్ చేస్తే ఆ ప్రోబ్లం సాల్వ్ అవుతుంది .
నోట్ : పై కోడ్ ఇస్తే ఫోన్ లో ఇంతకు ముందు స్టోర్ చేసి ఉన్న కాంటాక్ట్స్ , ఇమేజిలు , వీడియోలు అన్నీ చెరిగిపోతాయి . కనుక తప్పనిసరి అయితేనే వినియోగించండి .
Related Posts Plugin for WordPress, Blogger...