04 September 2009

వైయెస్ దేవుడెలాగంటే??

నాకైతే వైయెస్ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన దేవుడే అనిపిస్తుంది...
శ్రీరాముడు, సాయిబాబా లాంటివాళ్ళు దేవుళ్ళుగా ఎలా మారారు???
వాళ్ళు చేసినా అద్భుతాలు వైయెస్ చేయలేదా..
తాను ఎక్కడికి వెల్తున్నానో ఎవరికీ చెప్పనంటూనే తన చావును మందుగా చెప్పలేదా??
60 యేళ్ళకే రిటైరౌతానంటూ "జీవితంలోనే" రిటైరైపోలేదా???
ఈయన నిజంగా కలియుగ అవతారం..
మనం మూర్ఖులం కళ్ళముందే ఉన్న దేవుడ్ని గుర్తించలేక పోయాం..

ఆశ్రునయనాలతో ...

మన రాష్టానికి వర్షాలు ప్రసాదించి, కరవునుంచి తప్పించాలని ఆ భగవంతుడ్ని అడగడానికి వెళ్ళావా?
లేక
అభిమానింపబడడంలో తనను మించిపోతున్నావని ఆయనే నిన్ను తీస్కుపోయాడా?
లేక
నీనుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకుందామని ఆ గంధర్వులు ఎత్తుకెళ్ళారా?
మా మనసుల్లో నిండిఉన్ననిన్ను ఏ "శక్తీ" తీసుకుపోలేదన్నా.....

నీ ధ్రుఢసంకల్పం
ఎప్పుడూకదలాదే నీచిరునవ్వు
మాటతప్పని నీ వ్యక్తిత్వం
విశ్వాసానికి నీవు చెప్పిన కొత్త అర్ధం
నీవే ఓ దేవుడివేమోనని అనిపిస్తున్నయన్నా...!!!
నీవు ఎప్పటికీ మాహ్రుదయాల్లో చిరంజీవివే
... ఆశ్రునయనాలతో

02 September 2009

ముఖ్యమంత్రిని కనుక్కోలేని టెక్నాలజీయా మనది??

ఇంత టెక్నాలజీ డవలప్ అయినా ఒక్క ముఖ్యమంత్రి ఆచూకీ దాదాపు 10 గంటలుగా కనుక్కోలేకపోతున్నామంటే ఇది నిజంగా మన వైఫల్యమే...
ఇది మన శత్రుదేశాలకు ఉప్పందించడమే...
భారతీయులిగా సిగ్గుపడాలా? ఇది ప్రభుత్వ వైఫల్యమా??
మరి ఏమిటి???

01 September 2009

ఒపేరా 10.0 వచ్చేసిందోచ్ ???


"ఒపేరా" బ్రౌజర్ నచ్చని వారుండరు. అందమైన, చిన్నదిగాఉండి ,చక్కని, అనేక ఫీచర్స్ తో ఉండే  "ఒపేరా" అంటే అందరికీ ఇష్టమే!!
ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఒపేరా యొక్క చివరి మజిలీ ఐన వర్షన్ 10 రానెవచ్చింది. ఈరోజు (సెప్తెంబర్ 1 , 2009 ) ఒపేరా తన 10.0 వర్షన్ ను అధికారికంగా విడుదల చేసింది. విండొస్, మేక్ OS, లైనక్స్ లలో అందుబాటులో ఉన్న ఈ డౌన్ లోడ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 43 భాషలలో లభ్యమవుతోంది.
బిల్డ్ 1750 అనేది ఒపేరా 10.0 యొక్క చివరి మైలురాయి అనవచ్చు. 
దీన్ని క్రింది లింక్ నుండి దౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Related Posts Plugin for WordPress, Blogger...