05 May 2014

ఓటు వేయండి ! బ్రతికే ఉన్నామని నిరూపించుకొండి !!

     సీమాంధ్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలోనే కాదు అనేక బాషలవారినీ ఆసక్తి గొలిపేలా చేస్తున్నాయి . ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయాక తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. కాకపొతే ఆ ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డ అభ్యర్ధులలో కేసీయార్ తప్ప మిగతావారెవరూ అంత  ప్రాచుర్యంలో లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా కాదు .
      తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి తనకంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నారా చంద్రబాబునాయుడు ఒకవైపు, తర్వాత ఐదు సంవత్సరాలు ప్రపంచ ఐటి పటంపై రాష్ట్ర చిరునామా చెరగకుండా కాపాడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోవైపు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతున్నారు .
       క్రొత్త రాష్ట్రం... క్రొత్త అభివృద్ధి .. క్రొత్త కలలు ..  అటు ఈ ప్రాంత ప్రజలే కాక ప్రపంచ ఐటి దిగ్గజాలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాయన్నది నిజం . ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తమ వ్యాపారవిస్తరణలకు ఈ ప్రాంతంలో అవకాశాలు సంవృద్దిగా ఉన్నాయని వారు నమ్ముతున్నారు . హైదరాబాద్ లో ఉన్న వారిలో చాలామంది ఉద్యోగులు సీమంధ్ర ప్రాంతం వారేనని , వారికి నేరుగా తమ ప్రాంతంలోనే ఉద్యోగం కల్పించే అవకాశం  కల్పిస్తే వారు ఆసక్తి చూపగలరని, దీని ద్వారా భవిష్యత్ లో హైదరాబాద్ కంటే సీమాన్ధ్రలోనే ఐటికి భవిష్యత్ ఉంటుందని వారి ఆశ.
   ఇంతటి ప్రాముఖ్యత కలిగిస్తున్న ఈ ఎన్నికలలో ఓటు అందరూ తప్పక వేయాలి !
   ఒకవేళ సీమాంధ్రలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు, విద్యార్ధులు,వ్యాపారులూ ఎవరైనా తెలంగాణా ప్రాంతంలో గానీ, ఇతర రాష్ట్రాలలో గానీ ఉంటే తక్షణం మీ మీ ప్రాంతాలకు బయలుదేరండి !!
మీ ఓటు ... మీ భవిష్యత్ ... !!
ఓటు వేయండి ! బ్రతికే ఉన్నామని నిరూపించుకొండి !!
జై ఓటు ! జై జై ఓటు !!!



24 December 2013

ఉచితంగా హోస్టింగ్ అకౌంట్ - అతి సులభంగా..


100జీబీ బ్యాండ్ విడ్త్ తో , 10జీబీ స్పేస్ తో కూడిన హోస్టింగ్ అకౌంట్ కేవలం ఒక్క నిమిషంలో ఉచితంగా పొందాలంటే  క్రింది లింక్ ను క్లిక్ చేయండి చాలు. homehost.us అందిస్తుందీ అవకాశం.అన్నట్లు ఓ డొమైన్ నేం కూడా ఫ్రీ గానే వస్తుంది. నాయొక్క వెబ్ సైట్ ఇదిగో : http://srinivasrjy.homehost.us/

లింక్: http://homehost.us/

18 December 2013

అందరికీ నచ్చే వర్డుప్రెస్సు 3.8 పార్కర్

వర్డుప్రెస్సు  తన క్రొత్త వెర్షన్ 3.8 ను విడుదల చేసింది . దానిని రూపొందించిన చార్లీ పార్కర్ పేరుమీద దానికి పార్కర్ అని నామకరణం చేసింది. ఇక ఎలా ఉందంటారా ... చాలా బాగుందనే చెప్పాలి. వర్డుప్రెస్సు వాడేవారు అందరూ సంతోషించేలా క్రొత్త రూపం అడ్మిన్ పానెల్ లో ఉంది, కొన్ని డజన్ల రంగులు, గ్రేడియంట్ షేడ్స్ తో ముచ్చటగా ఉంది . మీరూ నవీకరించుకోండి.
: వివరాలకు :  http://wordpress.org/news/2013/12/parker/



02 November 2013

మీ బ్లాగును సెర్చ్ ఇంజన్లు గుర్తించేలా చేసుకోండిలా

సెర్చ్ ఇంజన్లు గుర్తించకపోతే ఎన్ని టపాలు వ్రాసినా చదివేవారు ఉండరు కదా... మనను ఏ టాపిక్ పై టపా వ్రాసినా ఎప్పుడో ఇకసారి సెర్చ్ ఇంజన్లద్వారా వెతికి మన టపా చదివేలగ ఉందాలి. లేకపోతే ఆగ్రిగేటర్లలో కనపడే ఆ కొద్ది గంటలు మాత్రమే కొందరు చదివగలరు ఆ తర్వాత ఆ టపా మరుగున పడిపోతుంది. ఎప్పటికీ టపా చదివేలాగ ఉండాలంటే సెర్చ్ ఇంజన్లకు దొరకాలి . అలా చేయాలంటే క్రింది సెట్టింగ్స్ మీ బ్లాగర్ డేష్ బోర్డ్ లో చేయండి.


ముందుగా బ్లాగర్ డేష్బోర్డ్ లో బ్లాగు సెట్టింగ్స్ కు వెళ్ళీ Search Preferences ఆప్షన్ ను ఎంచుకోండి. Description ను ఎనేబుల్ చేసి ఒక మంచి డెస్క్రిప్షన్ మీ బ్లాగుకు ఇవ్వండి.


ఇలా చేయడంవల్ల ఇకపై మీరు టపాలు వ్రాసేటప్పుడు ప్రక్కన Post ఆప్షన్లలో అని వస్తుంది. దానిలో మీ టపా టైటిల్ లేదా ఆ టపా గురించిన సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు.


ఆ తర్వాత ముఖ్యంగా చేయవల్సినది బ్లాగు టెంప్లేట్ హెడర్ లో మార్పులు. ఇవి చెయ్యకపోతే మీరు మార్చినా ప్రయోజనంలేదు.
అదెలా అంటే మీ టెంప్లేట్ ఏడిట్ లో అని ఉంటుంది. దాని పైన క్రింది విధంగా ఉండాలి లేకపోతే ఈ కోడ్ ను పేస్టే చేసి సేవ్ చేయండి.

<b:include data='blog' name='all-head-content'/>
	<title>
		<b:if cond='data:blog.pageType == &quot;index&quot;'>
			<data:blog.pageTitle/>
		<b:else/>
			<b:if cond='data:blog.pageType != &quot;error_page&quot;'>
				<data:blog.pageName/> | <data:blog.title/>
			<b:else/>
				404 | <data:blog.title/> 
			</b:if>
		</b:if>
    </title>
	<b:if cond='data:blog.metaDescription == &quot;&quot;'>
		<meta expr:content='data:blog.pageName + &quot; - &quot; + data:blog.title' name='description'/>
	<b:else/>
		<meta expr:content='data:blog.metaDescription' name='description'/>			
	</b:if>
 ( గమనిక : పై మార్పులు చేసే ముందు మీ టెంప్లేట్ ను బేక్ అప్ తీసుకోవడం మర్చిపోవద్దు. పై కోడ్ మర్పు చేసే ముందు ఇప్పటికే ఇలాంటి కోడ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న డెస్క్రిప్షన్ , కీ వర్డ్ మెటా టేగ్స్ ను తొలగించండి.)
Source: http://bloggeritems.com నుండి సేకరించబడిన సమాచారం ఆధారంగా పరిశోధన చేసిన పిదప వ్రాయబడినది. ...
 
 
Related Posts Plugin for WordPress, Blogger...