14 July 2023

సరికొత్త మార్పులతో మీ ముందుకు బ్లాగుల సంకలిని "శోధిని"

 చాలాకాలం తర్వాత మీ అభిమాన శోధిని లో  వీక్షకుల సౌకర్యార్ధం  కొన్ని మార్పులు చేయబడ్డాయి. అవి - 

ఇకపై రెండు వరుసలలో విడి, విడి బ్లాగుల నుంచి టపాలు కాకుండా అన్ని బ్లాగుల టపాలూ రెండువైపులా విస్తరిస్తాయి. దీనివల్ల మొబైల్ లో వీక్షించే వారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. రెండు వరసలలో చూపడం వల్ల ఒక వరుస క్రింద మరో వరుస వచ్చి క్రింది వరకూ రెండో వరుస టపాలకోసం వెళ్ళవలసి వచ్చేది.. ఇకపై ఆ ఇబ్బంది రాదు ..

 

 ఇక వేగం అంటారా ??? మీరే చూడండి ... దూసుకుపోతుంది

 

ఈ మార్పు మీకు నచ్చిందని ఆశిస్తున్నా....

ఇకపోతే...

వ్యాఖ్యల విభాగం కూడా కొన్ని మార్పులతో ముందుకి త్వరలో రాబోతుంది. 


శోధిని కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు

18 January 2022

Google Input Tools (Telugu) Download for Windows 7/8/10 తెలుగు టైపింగ్ Google Indic KeyBoard

 Download Telugu Input Tools from Google. Can be installed in Windows Computer



Download from Here




06 June 2021

కరోనా కాటుకు కవి, బ్లాగర్ "వంశి కలుగోట్ల" బలి

 



ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్దాం ....

బ్లాగులు

వంశీ కలుగోట్ల - కవితలు
 

12 May 2021

నాన్నకు ప్రేమతో.... నివాళులు

జననం: 7 నవంబర్ 1949
మరణం: 10 మే 2021


నాన్నా 

చదువుతో పాటూ నా కాళ్ళమీద నేను బ్రతకడం నేర్పావు 

నాకోసం నా భవిష్యత్ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావు 

అహర్నిశలూ అలసట లేకుండా కష్టపడ్డావు 

చివరికి కరోనా రక్కసికి బలయ్యావు 

ఎంత పిలిచినా నువ్వు తిరిగి రాలేవని తెలుసు 

కన్నీరు రాల్చడం తప్ప నీకోసం ఏమి చెయ్యగలను.

నీవు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడమే నీకు ఇచ్చే నివాళి అని తెలుసు.

దీన్ని   అనుక్షణం గుర్తుపెట్టుకుంటాను ...


ప్రేమతో 

పెదబాబు 

Related Posts Plugin for WordPress, Blogger...