నా కంప్యూటర్ కి బ్లూటూత్ లేదు.మొబైల్ తో connect చేయడానికని నిన్ననే మార్కెట్లో రెండు వందలుపెట్టి ఓ USBబ్లూటూత్ డాంగుల్ కొన్నాను.తీరా అది USBపోర్ట్ లో గుచ్చగా నా కంప్యూటర్ దాన్ని గుర్తించలేకపోయింది. ఆ డ్రైవర్ కోసం వెదికేపనిలో ఇంటర్నెట్ సెర్చ్ లో ఓ ట్రిక్ దొరికింది. మీకోసం ఆ ట్రిక్ వివరిస్తాను.
క్రింది క్రమంలో చేయాలి.
1. మొదట USB dongleని USBportకి గుచ్చండి.
2. ఒకవేళ driverని ఇన్ స్టాల్ చేయమని పాప్ అప్ విండో వస్తే క్లోజ్ చేయండి.
3. ఇప్పుడు start---> RUNలో devmgmt.msc అని టైప్ చేయండి.
4. Other devicesలోunknown పేరిట ? మార్కుతో ఉన్న హార్డ్వేర్ ఉంటుంది.దానిపై రైట్ క్లిక్ చేసి propertiesలో detailsకి వెళ్ళండి.
అక్కడ “USB\Vid_1CAA&Pid_0001″లాంటి ఓ HardwareID ఉంటుంది.దాన్ని వ్రాసుకోండి.
5. ఇపుడు మళ్ళీ RUNలో %windir%\inf\ అని typeచేయండి. అక్కడ bth.inf అనే ఫైల్ కోసం వెతకండి.
6. bth.infని notepadలో open చేయండి.అందులో [manufacturer]అనే sectionలో MyName=MyName, NT.5.1 అని కలపండి.
7. దానిక్రిందే “Device Section Start”అని ఉంటుంది. అక్కడ
[MyName.NT.5.1]
MyName Bluetooth Device=BthUsb, USB\Vid_1CAA&Pid_0001
అని కలపాలి.
8. ఇప్పుడు దీన్ని bth_modified.infఅని modify చేసి “%windir%\inf\”ఫోల్డర్ లోనే save చేయండి.
9. device Managerలో మళ్ళీ USB device కోసం scan చేయండి.
10. ఇప్పుడు మీ బ్లూటూత్ దివైస్ ని గుర్తించింది కదూ..??
ఈ ట్రిక్ మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ...
మాళ్ళీ కలుద్దాం..!!!
No comments:
Post a Comment