06 September 2009

అతి చక్కని XP టూల్ "మూవ్ టూ, కాపీ టూ"

కంప్యూటర్లో ఒక ఫైల్ ను ఒకచోటినుండి వేరొకచోటికి మార్చాలన్నా, కాపీ చేయాలన్నా "కాపీ(copy)" "పేష్టు(paste)" ఫంక్షన్ వాడతారు కదా??
ఇలా చేయాలంటే కాపీ చేయాలి మళ్ళీ.. ఎక్కడ పేష్టు చేయాలో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసి పేష్టు చేయాలి కదా...
ఇటువంటి అవసరం లేకుండా కేవలం రైట్ క్లిక్ తో అవసరమనుకొన్న ఫోల్డర్ లోకి  పేష్టు చేయొచ్చు క్రింది టూల్ తో. (నిజానికి రిజిస్ట్రీ లో మార్పులు తీసుకువచ్చేదే ఈ టూల్ )
ఇది ఎంతోచిన్నదైన టూల్, నాకైతే బాగా నచ్చింది . కేవలం ఈ పేచ్ పై క్లిక్ చేస్తే మనల్ని నిజంగా రిజిస్ట్రీ లోకి కాపీ చేయాలా అని అడుగుతుంది.. సరే అని ప్రెస్ చేస్తేచాలు...
ముఖ్య గమనిక: ఈ టూల్ ఉపయోగించడం వల్ల నాకైతే ఏ ప్రోబ్లం కనపడలేదుగానీ, మీడియా ప్లేయర్ లో ఒక ఫోల్డర్ నుంచి ఒకేసారి అన్నిసాంగ్స్ ప్లే చేసే సమయంలో ఈ ఆప్షన్ వస్తూ ఉంది... దీనికి ఎవరైనా సొల్యూషన్ చెపుతారా???
< డౌన్ లోడ్ చేసుకోండి > ( 1 KB మాత్రమే )

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...